Arjun Suravaram
దేశ వ్యాప్తంగా ఎన్నిక వేడి మొదలైంది. అన్ని ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఇదే సమయంలో ఎన్నికల నోటిఫికేన్ ఎప్పుడు వస్తుందా అనే ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం కీలక అప్ డేట్ ఇచ్చింది.
దేశ వ్యాప్తంగా ఎన్నిక వేడి మొదలైంది. అన్ని ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఇదే సమయంలో ఎన్నికల నోటిఫికేన్ ఎప్పుడు వస్తుందా అనే ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం కీలక అప్ డేట్ ఇచ్చింది.
Arjun Suravaram
త్వరలో దేశం వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎప్పుడూ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందా అని రాజకీయ నేతలతో పాటు ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందంటూ ప్రచారం జరిగింది. ఎట్టకేలకు సార్వత్రిక ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక అప్ డేట్ ఇచ్చింది. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ గురించి ఎన్నికల సంఘం కీలక సమాచారం ఇచ్చింది. రేపు లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ పై ఎన్నికల సంఘం ప్రకటన చేయనుంది. ఇదే సమయంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై కూడా కీలక అప్ డేట్ రానుంది.
లోక్ సభ ఎన్నికల నగారా శనివారం మోగననుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటన చేసింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ పెట్టనుంది. అలానే లోక్ సభకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించనుంది. లోక్ సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈసీఈ విడుదల చేయనుంది. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా శనివారం విడుదల కానుంది.
లోక్ సభతో పాటు ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ రేపు విడుదల కానుంది. మరి ఎన్ని విడతల్లో పోలింగ్ జరగనుంది అనేది రేపు ఈసీ ప్రకటించే షెడ్యూల్ లో తెలియనుంది. గతంలో ఏడు విడుదలుగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 2019లో ఏపీకి మొదటి విడతలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరిగాయి. ఏపీ తెలంగాణలో కలిసే ఒకే విడుతలో ఎన్నికలుంటాయా, లేదంటే వేర్వేరుగా ఉంటాయన్న దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. రేపు అటు ఈసీఈ షెడ్యూల్, ఇటు వైఎస్సార్ సీపీ అభ్యర్థుల జాబితా ప్రకటన జరగనుంది. ఏపీతో పాటు ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా షెడ్యూల్ విడుదల కానుంది. రేపు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో ఏపీలో ఎలక్షన్ సునామీ ప్రారంభం కానుంది.