iDreamPost
android-app
ios-app

AP ఓటర్ల తుది జాబితా విడుదల.. చెక్ చేసుకోండి ఇలా!

AP Voters Final List: వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటర్ల తుది జాబితా విడుదలైంది. సోమవారం ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. సీఈవోఆంధ్ర.ఎన్ఐసీ.ఇన్ వెబ్‌సైట్‌లో ఫైనల్ ఎస్‌ఎస్‌ఆర్ 2024 పేరుతో తుది ఓటర్ల జాబితాను ఎలక్షన్ కమిషన్ ప్రచురించింది.

AP Voters Final List: వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటర్ల తుది జాబితా విడుదలైంది. సోమవారం ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. సీఈవోఆంధ్ర.ఎన్ఐసీ.ఇన్ వెబ్‌సైట్‌లో ఫైనల్ ఎస్‌ఎస్‌ఆర్ 2024 పేరుతో తుది ఓటర్ల జాబితాను ఎలక్షన్ కమిషన్ ప్రచురించింది.

AP ఓటర్ల తుది జాబితా విడుదల.. చెక్ చేసుకోండి ఇలా!

ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అదే విధంగా అధికార వైసీపీ అయితే అభ్యర్థులను ప్రకటించే పనిలో నిమగ్నమైంది. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇదే సమయంలో అభ్యర్థులను ప్రకటించడంలో టీడీపీ, జనసేన కూటమి వెనకబడిందనే టాక్ వినిపిస్తోంది. ఇలా రాజకీయ పార్టీలు ఎన్నికల సమరంలోకి దిగిన వేళ ఎన్నికల సంఘం కీలక విషయం ప్రకటించింది. 2024  ఏపీ ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మరి..మీ పేరు ఓటర జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోండి.

ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో 2024 ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆ జాబితాను కూడా జిల్లాల వారీగా విడుదల చేసింది. సీఈఓ ఆంధ్రా వెబ్ సైట్  లోజిల్లాల వారీగా  తుది ఓటర్ల జాబితాను విడుదల చేసినట్లు ఎన్నికల సంఘం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.

ఇక ఎన్నిక సంఘం విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాను జిల్లాలు, అందులో నియోజకవర్గాలు, గ్రామాల స్థాయిలో ప్రచురించింది. అసెంబ్లీ స్థానాల వారీగా ఓటర్ల జాబితాలను ఎన్నికల సంఘం ప్రచురించింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా, అందులోనూ గ్రామాలు, పట్టణాల వారీగా పీడీఎఫ్ ఓటర్ల జాబితాలను సీఈఓ ఆంధ్రా వెబ్‌సైట్‌లో ఎన్నికల సంఘం అప్ లోడ్ చేసింది. ఓటర్ల జాబితాను ఎక్కడికక్కడే విడుదల చేయాలని ఎలక్షన్ కమిషన్.. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. గత ఆరు నెలలుగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు, అధికారులను నియమించి ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కొత్తగా ఓటు హక్కుకు అర్హత కలిగిన వారి పేర్లను నమోదు చేశారు. కొత్త ఓటర్ల నమోదును వేగవంతం చేశారు.

ఆరు నెలల్లో పలు దశల్లో ఓటర్ల జాబితాను విడుదల చేసి.. మార్పులు చేస్తూ వచ్చారు. ఓటు ప్రాధాన్యతపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించారు. గతంలోనే జనవరిలో తుది జాబితాను విడుదల చేస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. అన్ని ప్రక్రియలు పూర్తి అయ్యాక సోమవారం అధికారికంగా తుది ఓటరు జాబితాను విడుదల చేశారు. ఇక మీ పేరు ఓటర్ల తుది జాబితాలో ఉందో లేదో చెక్ చేయడానికి  https://voters.eci.gov.in/download-eroll?stateCode=S01  పై కిక్ల్ చేయండి. ఆ వెబ్ సైట్ లోకి వెళ్లిన తరువాత జిల్లా ఉన్న ఆఫన్ష్ లో మీ జిల్లా పేరు నమోదు చేయండి. అనంతరం మీ నియోజకవర్గం పేరు నమోదు చేస్తే.. అందులోని గ్రామాలు, పట్టణాల వారిగా ఓటర్ల జాబితా కనిపిస్తుంది. అక్కడ డ్రాఫ్ట్ రోల్-2024, ఫైనల్ రోల్-2024 అనే రెండు కనిపిస్తాయి. వీటి పీడీఎఫ్ లను డౌన్ లోడ్ చేసుకుని.. ఆ లిస్టులో మీ పేరును ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.