Dharani
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఘట్టం నేటితో పూర్తి కానుంది. నేడు పోలింగ్ జరుగుతుంది. మరో మూడు రోజుల్లో ఫలితాలు వెల్లడవుతాయి. అయితే మీ పేరు ఓటర్ లిస్ట్ లో ఉండి.. ఓటర్ ఐడీ రాకపోతే.. ఈ 12 కార్డుల్లో ఏది ఉన్నా ఓకే అంటున్నారు. ఆ వివరాలు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఘట్టం నేటితో పూర్తి కానుంది. నేడు పోలింగ్ జరుగుతుంది. మరో మూడు రోజుల్లో ఫలితాలు వెల్లడవుతాయి. అయితే మీ పేరు ఓటర్ లిస్ట్ లో ఉండి.. ఓటర్ ఐడీ రాకపోతే.. ఈ 12 కార్డుల్లో ఏది ఉన్నా ఓకే అంటున్నారు. ఆ వివరాలు..
Dharani
తెలంగాణలో పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఉదయం నుంచే ఓటర్లు.. పోలింగ్ కేంద్రాలకు చేరుకుని.. ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో.. ఎలక్షన్ కమిషన్ కట్టుదిట్టమైన భద్రత, పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు.. పోలింగ్ కేంద్రాలకు వచ్చి.. ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈసారి ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. అంతేకాక పోలింగ్ సమయంలో గుర్తింపు కార్డు ముఖ్యమని అధికారులు చెప్తున్నారు. అయితే.. ఈ ఏడాది కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే కొందరి పేరు ఓటర్ల లిస్టులో వచ్చినా.. ఓటర్ గుర్తింపు కార్డు రావటంలో అలస్యం జరిగింది మరి వాళ్ల పరిస్థితేంటి.. వారు ఓటు ఎలా వేయాలంటే..
ఓటర్ లిస్ట్ లో పేరు వచ్చి ఓటరు గుర్తింపు కార్డు రాకపోతే.. అందుకు ప్రత్యామ్నయం సూచించింది ఎన్నికల సంఘం. ఓటరు గుర్తింపు రాని వారి కోసం.. దానికి ప్రత్యామ్నాయంగా మరో 12 గుర్తింపు కార్డులలో ఏది చూపించైనా ఓటు వేసే అవకాశాన్ని సీఈసీ కల్పించిందని హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు.
గతంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది నమోదు చేసుకున్న కొత్త ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులను ఉచితంగా పంపిణీ చేశామని చెప్పుకొచ్చారు. పోలింగ్ కేంద్రంలో గుర్తింపు నిర్ధారణకు పంపిణీ చేసిన ఓటరు స్లిప్‌లు చూపిస్తే సరిపోదని.. ఓటర్ ఐడీ కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన 12 గుర్తింపు కార్డుల్లో ఏది చూపించినా ఓటు వేసేందుకు అనుమతిస్తారని తెలిపారు.
పైన సూచించిన కార్డుల్లో ఏదైన ఒక కార్డును తీసుకుని.. పోలింగ్ బూతులో చూపించి ఓటు వేయోచ్చని హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్‌రోస్ పేర్కొన్నారు. ఇక తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. అయితే పలు చోట్ల ఈవీఎంలు మోరాయిస్తున్నాయి. దాంతో పోలింగ్ ఆలస్యం అవుతోంది.