iDreamPost
android-app
ios-app

Voter List: ఓటరు జాబితాలో మీ పేరు తొలగించారా? అయినా ఓటేయవచ్చు! ఎలా అంటే..

అర్హత కలిగిన ప్రతి పౌరుడూ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమైన ఓటింగ్‌లో పాల్గొనేందుకు వీలుగా ఎన్నికల సంఘం అనేక సౌకర్యాలు కల్పించింది. ఓటరు జాబితా సవరణలో ఏ కారణం చేతనైనా మీ పేరు తొలగించినప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఓటు వేసేందుకు అవకాశం ఉంది.

అర్హత కలిగిన ప్రతి పౌరుడూ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమైన ఓటింగ్‌లో పాల్గొనేందుకు వీలుగా ఎన్నికల సంఘం అనేక సౌకర్యాలు కల్పించింది. ఓటరు జాబితా సవరణలో ఏ కారణం చేతనైనా మీ పేరు తొలగించినప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఓటు వేసేందుకు అవకాశం ఉంది.

Voter List: ఓటరు జాబితాలో మీ పేరు తొలగించారా? అయినా ఓటేయవచ్చు! ఎలా అంటే..

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి నడుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ చాలా హాట్ హట్ గా ఉంది. ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాయి. మే 13 పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇక పోలింగ్ కి సమయం దగ్గర పడుతొన్న కొద్ది పొలిటికల్ లీడర్లలో టెన్షన్ ప్రారంభమైంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా పొటిలికల్ ఇష్యూ పక్కన పెడితే.. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమైనదే. అందుకే ప్రతి ఒక్కరు తమ ఓటు వినియోగించుకోవాలి. ఈ క్రమంలోనే ఓటర్ లిస్ట్ లో పేరు తొలగించిన  ఓటేసే అవకాశం ఉంది. ఎలాగా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

మనది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ పాలకులను ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల చేత ఎన్నుకుంటారు. అందుకోసం అర్హులైన దేశంలోనే పౌరులందరికి ఎన్నికల సంఘం ఓటు వేసే అవకాశం కల్పిస్తుంది. అర్హత కలిగిన ప్రతి పౌరుడూ ఓటింగ్‌లో పాల్గొనేందుకు వీలుగా ఎన్నికల సంఘం అనేక సౌకర్యాలు కల్పించింది. ముఖ్యంగా ఓటర్ల జాబితాను రూపొందించడం, మార్పులు చేర్పులు ఉంటే చేయడం మొదలైన కార్యక్రమాలను చేస్తుంది. ఈ క్రమంలోనే ఓటరు జాబితా సవరణలో ఏ కారణం చేతనైనా మీ పేరు తొలగించినప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మీ ఓటు వేసేందుకు ఛాన్స్ ఉంది.

సాధారణంగా ఓటరు జాబితాను పరిశీలనకు అధికారులు వచ్చినప్పుడు మీరు లేకపోతే.. జాబితా నుంచి పేర్లు తీసేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా అధికారులు వచ్చిన రోజు హాజరు కాలేక పోయివారి పేర్లతో ప్రత్యేక జాబితాను  రూపొందింస్తారు. అంతేకాకుండా… ఏదైనా కారణంతో మీ అడ్రస్‌ మారి ఉంటే ఇంకో జాబితా ఉంటుంది. అలానే మరణించిన వారి కోసం కూడా ప్రత్యేకంగా జాబితా సిద్ధం చేస్తారు. ఇలా ఓటర్ల నుంచి సేకరించిన జాబితాలన్నీ ప్రిసైడింగ్ అధికారికి అందుబాటులో ఉంటాయి.  ఎవరైనా ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వస్తే.. అక్కడ ఓటరు జాబితాలో లేకపోతే.. ఆ వ్యక్తి పేరును ఏఎస్డీ ఓటర్ల లిస్ట్ లో వెతకాలి. ఒక వేళ ఏఎస్డీ ఓటర్ల జాబితాలో కూడా వ్యక్తి పేరు లేకుంటే వేసే అవకాశంలేదు.

కానీ ఏఎస్డీ ఓటర్ల లిస్ట్ లో ఆ వ్యక్తి పేరుంటే మాత్రం ఓటరు గుర్తింపు కార్డు/ లేదా ఇతర గుర్తింపు కార్డుల ఆధారంగా ఆ వ్యక్తి గుర్తింపును ప్రిసైడింగ్‌ అధికారి నిర్ధారించుకుంటారు. ఆ తరువాత ఆ వ్యక్తి పేరును ఫారం 17ఏలో నమోదు చేసి సంతకం, వేలిముద్ర  తీసుకుంటారు. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రంలో ఉండే తొలి అధికారి సదరు ఏఎస్డీ ఓటరు పేరును ఏజెంట్లకు గట్టిగా వినిపిస్తారు. సదరు ఓటరు నుంచి నిర్దిష్ట ఫార్మాట్‌లో డిక్లరేషన్‌ తీసుకోవడంతో పాటు ఫోటో, వీడియో కూడా  తీసుకుంటారు. అనంతరం అతడికి ఓటు వేసే ఛాన్స్ కల్పిస్తారు. పై విధంగా ఓటరు జాబితాలో పేరు లేని వాళ్లు ఓటు వేసే అవకాశం ఉంది.