రెండు రోజుల క్రితం హైదరాబాద్ సరూర్ నగర్ లో జరిగిన పరువు హత్య సంచలనం సృష్టించింది. ఆశ్రీన్ అనే ఓ ముస్లిం అమ్మాయి, నాగరాజు అనే ఓ దళిత హిందూ అబ్బాయి గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకొని ఆశ్రీన్ ఇంట్లో ఒప్పుకోకపోవడంతో పెళ్లి చేసుకొని హైదరాబాద్ కి వచ్చి జీవితం గడుపుతుండగా అమ్మాయి సోదరుడు మతాంతర వివాహం చేసుకుందని పగబట్టి రెక్కీ నిర్వహించి మరీ ఆ యువకుడిని మరికొంతమందితో కలిసి నడిరోడ్డు మీదే చంపేశాడు. ఈ పరువు […]
ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తేహదుల్ ముస్లమీన్ (ఏఐఎంఐఎం)… తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని పాతబస్తీకి, ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గానికే పరిమితమైన ఈ పార్టీ రూపురేఖలు ప్రస్తుతం మారిపోతున్నాయి. నగరం దాటి దేశంలోని వివిధ రాష్ట్రాలలో సత్తా చాటాలని ఎంఐఎం చేసిన ప్రయత్నాలు బిహార్ ఎన్నికల తర్వాత సఫలమవుతున్నాయి. గడచిన బిహార్ ఎన్నికల్లో ఆ పార్టీ ఐదు స్థానాలు గెలుచుకోవడం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఆలోచింపజేసింది. అంతకు ముందు మహారాష్ట్రలోనూ ఆ పార్టీ […]
ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ.. అదే మజ్లిస్. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ సీట్లలో తనకంటూ ఎప్పుడూ కొన్ని సీట్లను రిజర్వ్ చేసుకుని పెట్టుకుంటుంది. ఎన్నిక ఏదైనా పాతబస్తీలో ఆ పార్టీకి తిరుగులేదు. భారతీయ జనతా పార్టీ కొన్ని స్థానాల్లో గట్టి పోటీ అయితే ఇవ్వగలుగుతుంది కానీ.. పాగా వేయలేకపోతోంది. 2016 ఎన్నికల్లో కేవలం 2 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. మజ్లిస్ పార్టీ 60 స్థానాల్లో పోటీ చేయగా.. 44 చోట్ల […]
ముందొచ్చిన చెవుల కన్నా.. వెనుకొచ్చిన కొమ్ములు వాడీ అన్నట్లుగా.. బిహర్ శాసన సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో ఏళ్ల తరబడి రాజకీయాలు చేస్తున్న పార్టీల కన్నా కొత్తగా వెళ్లిన ఎంఐఎం పార్టీ తన సత్తాను చాటింది. 243 అసెంబ్లీ సీట్లు గల బిహార్లో ఐదు సీట్లు గెలుచుకుని ఐదవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అమౌర్, కొచాధమన్, జోకిహాట్, బైసీ, బహుదుర్గంజ్ నియోజకవర్గాల్లో ఎంఐఎం విజయం సాధించింది. 2015 ఎన్నికల్లో బిహార్లో తొలిసారి ఎంఐఎం పోటీకి సిద్ధమైంది. ఆరు […]
ఒకపక్క దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి (CAA) వ్యతిరేకంగా ఆందోళనలు అట్టుడుకుతున్న సమయంలో భారత పౌరులకు ఆధార్ కార్డు జారీ చేసే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) హైదరాబాదీలకు షాక్నిచ్చింది. తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలసిందిగా హైదరాబాద్లో నివసిస్తున్న 127 మందికి నోటీసులు జారీ చేసింది. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఫిబ్రవరి 20 లోగా విచారణకు రావాలని యూఐడీఏఐ ఆదేశించింది. సరైన పత్రాలు సమర్పించకపోయినా, భారత పౌరులమని నిరూపించుకోకపోయినా వారి ఆధార్ కార్డులను రద్దు చేస్తామని […]