iDreamPost
android-app
ios-app

ముస్లింలే ఎక్కువ కండోమ్స వాడుతున్నారు : ఓవైసీ

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేడి కొనసాగుతుంది. ఇప్పటికే రెండు దశల ఎన్నికలు ముగిశాయి. అలాగే దేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మజ్లీస్ అధినేత ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేడి కొనసాగుతుంది. ఇప్పటికే రెండు దశల ఎన్నికలు ముగిశాయి. అలాగే దేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మజ్లీస్ అధినేత ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.

ముస్లింలే ఎక్కువ కండోమ్స వాడుతున్నారు : ఓవైసీ

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి నెలకొంది. తెలుగు రాష్ట్రాలతో పాటు భారత్ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సంగతి విదితమే. ఇటు ఆంధ్రప్రదేశ్‌కు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఏడు దశల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రెండు దశల పోలింగ్ ముగిసింది. తెలంగాణ, ఏపీల్లో కూడా మే 13న ఎన్నికలు జరగనున్నాయి. దేశంలోని అధికార, ప్రతిపక్ష నేతలు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేగుతున్నాయి. దేశ ప్రజల సంపదను దోచుకుని చొరబాటుదారులకు కాంగ్రెస్ పంచాలని చూస్తుందని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై కౌంటరిచ్చారు ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఓవైసీ.

ఏప్రిల్ 21న రాజస్తాన్‌లోని బన్స్వారాలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. దేశ సంపదను చొరబాటుదారులు, ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి పంచేస్తుంది’ అంటూ ముస్లింలను ఉద్దేశించి ఇన్ డైరెక్ట్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఓవైసీ స్పందించారు. ‘ ముస్లింలకు ఎక్కువ మంది పిల్లలు ఉన్నారని మోడీ అంటున్నారు. కానీ ఎక్కువ మంది ముస్లింలు కండోమ్స్ వాడుతున్నారు. ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని కంటారనే భయాన్ని ఆయన సృష్టిస్తున్నారు. మీ లెక్కల ప్రకారమే ముస్లింల జనాభా పెరుగుదల, సంతానోత్పత్తి తగ్గింది. దీనికి కారణం ముస్లింలు కండోమ్స్ వాడటమే. ఇది చెప్పేందుకు సిగ్గుగా లేదు’ అంటూ ప్రధానికి కౌంటర్ ఇచ్చారు ఓవైసీ.

‘ దళితుల్ని, ముస్లింలను ద్వేషించే నరేంద్ర మోడీ ఒకటి భావిస్తున్నారు. ఈ దేశంలో ముస్లింలు ఏదో ఒక రోజు మెజార్టీ పీపుల్ అయిపోతారని, మన హిందూ సోదరులను నమ్మించేలా ఆయన ప్రయత్నిస్తున్నారు. మోడీ.. మీరు ఎంతకాలం ముస్లింల పట్ల భయాన్ని పెంచుతారు’ అంటూ నిలదీశారు. ప్రధాని మోడీ పచ్చి అబద్దాలు ఆడుతున్నారన్న అసదుద్దీన్.. మోడీకి ఆరుగురు సోదరులు, కేంద్ర మంత్రి అమిత్ షాకు ఆరుగురు సోదరీమణులు ఉన్నారని, ఆర్ఎస్ఎస్ నేత గోల్వాకర్‌కి 11 మంది సంతానం ఉన్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. జనాభా నియంత్రణ పాటించని మీరు ముస్లింలపై అభాండాలు వేస్తూ తప్పుడు లెక్కలు చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇక ఓవైసీ విషయానికి వస్తే.. పాత బస్తీ నుండి ఎంపీగా పోటీ చేస్తున్న సంగతి విదితమే. ఆయనపై పోటీగా బీజెపీ.. మాధవీలతను బరిలోకి దింపింది.