iDreamPost
android-app
ios-app

బాబ్రీ మసీదుని ముస్లింల నుంచి ఒక పద్ధతిలో లాగేసుకున్నారు: ఒవైసీ

ప్రస్తుతం చిన్నా పెద్దా అని తేడా లేకుండా యావత్ భారతదేశం.. ఆ అయోధ్య రామయ్య మీద ఉన్న భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు. ఇదే సమయంలో కొందరు అయోధ్య రామాలయం అంశంలో వివిధ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఎంఐఎం అధ్యక్షుడుఅసదుద్దిన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం చిన్నా పెద్దా అని తేడా లేకుండా యావత్ భారతదేశం.. ఆ అయోధ్య రామయ్య మీద ఉన్న భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు. ఇదే సమయంలో కొందరు అయోధ్య రామాలయం అంశంలో వివిధ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఎంఐఎం అధ్యక్షుడుఅసదుద్దిన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బాబ్రీ మసీదుని ముస్లింల నుంచి ఒక పద్ధతిలో లాగేసుకున్నారు: ఒవైసీ

దేశ వ్యాప్తంగా కొట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్న అపూర్వ ఘట్టం  సాకారం అయ్యేందుకు మరో రెండు రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ శ్రీరాముడిపై తమకు ఉన్నభక్తిని వివిధ రూపాల్లో ప్రదర్శిస్తున్నారు. జనవరి 22న శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే గత కొన్ని రోజుల నుంచి రామయ్యకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు జరుగుతోన్నాయి. ఇలా ఎంతో అంగరంగవైభవంగా అయోధ్య  రామాలయం ప్రారంభోత్సవ ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో పలువురు రాజకీయ నేతలు వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.

అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుక ముందు ఏఐఏంఐఎం అధ్యక్షడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదును ముస్లింల నుంచి ఓ క్రమ పద్ధతిలో తీసుకున్నారని ఆయన తెలిపారు. శనివారం కర్ణాటక రాష్ట్రంలోని కలబురిగిలో మీడియాతో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. ఈ సందర్భంగా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం జరగనున్న వేళ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఓవైసీ ఇంకా మాట్లాడుతూ.. 1992లో బాబ్రీ మసీదును కూల్చివేయకుంటే నేడు ముస్లింలు ఇలాంటి వాటిని చూడాల్సిన అవసరం ఉండేది పేర్కొన్నారు. 500 ఏళ్లుగా బాబ్రీ మసీదులో ముస్లింలు నమాజ్ చేశారని ఆయన తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్  రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన గోవింద్ వల్లభ్ పంత్ ఉన్నప్పుడు మసీదులో విగ్రహాలు పెట్టారని ఓవైసీ ఆరోపించారు. అదే సమయంలో అయోధ్య జిల్లాకు కలెక్టర్‌గా నాయర్ ఉండేవారని, ఆయన బాబ్రీ మసీదును మూసివేసి, అక్కడ పూజలు చేయడం ప్రారంభించారంటూ ఓవైసీ చెప్పుకొచ్చారు. విశ్వ హిందూ పరిషత్ పుట్టినప్ప్పుడు రామమందిరం లేదని ఓవైసీ తెలిపారు.

ఇక అయోధ్య రామాలయం గురించి మహాత్మాగాంధీ ఎప్పుడూ ఏమీ ప్రస్తావించలేదన్నారు. చాలా క్రమపద్ధతిలో భారతీయ ముస్లింల నుంచి బాబ్రీని లక్కున్నారని ఓవైసీ అన్నారు. ప్రతిపక్ష పార్టీలను, ముఖ్యంగా ఆప్ మెజారిటీ వర్గాలను సంతోష పెట్టే పనిలో నిమగ్నమయ్యాయని ఆయన అన్నారు. అయితే ఇదే సమంయలో మైనారిటీల గురించి మాట్లాడటం లేదని చెప్పుకొచ్చారు. ఇండియా కూటమిలో ఉన్న భాగమైన ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతీ మంగళవారం సుందరాకాండ పారాయణం, హనుమాన్ చాలీసా నిర్వహిస్తామని చెబుతున్నారని, ఈ విషయం గురించి ఎవరూ ఏమీ మాట్లాడటం లేదని ఓవైసీ అన్నారు. అందుకు కారణం వారంతా మెజారిటీ వర్గాల ఓట్లను లక్ష్యంగా చేసుకునే పనిలో బిజీగా ఉన్నారని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఇలా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేళ అనుకూలంగా, ప్రతికూలంగా పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి.. అసదుద్దిన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.