iDreamPost
android-app
ios-app

రాహుల్ గాంధీ దమ్ముంటే హైదరాబాద్ లో పోటీచెయ్.. సవాల్ విసిరిన ఒవైసీ!

  • Author Soma Sekhar Published - 11:40 AM, Mon - 25 September 23
  • Author Soma Sekhar Published - 11:40 AM, Mon - 25 September 23
రాహుల్ గాంధీ దమ్ముంటే హైదరాబాద్ లో పోటీచెయ్.. సవాల్ విసిరిన ఒవైసీ!

తెలంగాణలో త్వరలోనే ఎన్నికల నగారా మోగబోతోంది. ఈ నేపథ్యంలో లీడర్ల సవాళ్లు, ప్రతి సవాళ్లతో పాలిటిక్స్ హీటెక్కాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించి.. ప్రత్యర్థులకు సవాల్ విసిరింది. వరసగా మూడోసారి కూడా అధికారం నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుండగా.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా తొలిసారి అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, మోదీ అభివృద్ధి మంత్రంతో బీజేపీలు అధికారం కోసం పోటీపడుతున్నాయి. ఇక ఎంఐఎం పార్టీ కూడా తన ఉనికిని చాటుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ విజయభేరిలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. రాహుల్ దమ్ముంటే వయనాడ్ లో కాదు హైదరాబాద్ లో పోటీచేయాలని సవాల్ విసిరిరాడు.

ఇటీవల జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. ఈ మూడు పార్టీలు ఒక్కటేనని, కేసీఆర్, ఒవైసీలు మోదీకి దత్తపుత్రులని రాహుల్ గాంధీ ఈ సభలో విమర్శించాడు. ఈ విమర్శలకు కౌంటర్ ఇస్తూ.. తాజాగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రాహుల్ కు సవాల్ విసిరాడు. “వచ్చే ఎన్నికల్లో వాయనాడ్ లో కాకుండా హైదరాబాద్ నుంచి పోటీచేయాని రాహల్ కు సవాల్ విసురుతున్నాను. పెద్ద పెద్ద ప్రకటనలు చేయడం కాదు.. దమ్ముంటే ఇక్కడ బరిలోకి దిగి నాపై పోటీచేయాలని, నాతో పోరాడండని కోరుతున్నాను. కాంగ్రెస్ హయాంలోనే బాబ్రీ మసీదు, సెక్రటేరియల్ మసీదులు కూల్చివేశారు. కాంగ్రెస్ వారు ఎన్నో మాటలు చెబుతారు. కానీ నేను పోటీకి సిద్దంగా ఉన్నాను” అని కౌంటర్ ఇచ్చారు ఒవైసీ. మరి ఒవైసీ సవాల్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రీ కౌంటర్ వేస్తారా? లేదా? అన్నది చూడాలి.