P Venkatesh
కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టంపై కీలక నిర్ణయం తీసుకుంది. చట్టాన్ని అమలు చేస్తూ కేంద్ర హోం శాఖ గెజిట్ విడుదల చేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై అసదుద్దిన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టంపై కీలక నిర్ణయం తీసుకుంది. చట్టాన్ని అమలు చేస్తూ కేంద్ర హోం శాఖ గెజిట్ విడుదల చేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై అసదుద్దిన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
P Venkatesh
పౌరసత్వ సవరణ చట్టం దేశంలో మళ్లీ హాటా టిపిక్ గా మారింది. ఎప్పుడో ఐదేండ్ల క్రితం సీఏఏ చట్టాన్ని రూపొందించి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు. ఉన్నట్టుండి నిన్న(11-03-2024) సీఏఏ చట్టాన్ని అమలు చేస్తూ కేంద్ర హోం శాఖ గెజిట్ విడుదల చేసింది. మరి కొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు రానున్న వేళ కేంద్ర ప్రభుత్వం సీఏఏ చట్టాన్ని అమలు చేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సీఏఏ చట్టాన్ని అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ దేశంలో ఎన్నికలు రాగానే సీఏఏ నిబంధనలు వస్తాయని కేంద్ర ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సందించారు.
సీఏఏ చట్టం అమల్లోకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఎమ్ఐఎమ్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ సీఏఏపై తమకు అభ్యంతరాలున్నాయని వెల్లడించారు. 2019లోనే లోక్ సభ, రాజ్య సభలో ఆమోదం పొందిన సీఏఏ చట్టాన్ని ఇప్పటి వరకు అమలు చేయకుండా జాప్యం ఎందుకు చేశారని అన్నారు. ఎన్నికలు సమీపించగానే ఇప్పుడెందుకు అమలు చేయడానికి సిద్ధమయ్యారో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. మతం ఆధారంగా కాకుండా హింసకు గురైన వారికి దేశంలో ఆశ్రయం ఇవ్వండని కేంద్రానికి సూచించారు. విదేశాల నుంచి వచ్చిన అన్ని మతాల వారికి పౌరసత్వం కల్పించి.. ఒక్క ముస్లింలకు మాత్రం పౌరసత్వం ఇవ్వకూడదని కేంద్రం నిర్ణయిచడంతో దేశంలో ముస్లింల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి.
పౌరసత్వ సవరణ చట్టం వల్ల దేశంలోని ముస్లిం పౌరులకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తవని క్లారిటీ ఇచ్చినప్పటికీ వారిలో అభద్రతాభావం తొలగిపోవడం లేదు. ఇక సీఏఏ చట్టం అమల్లోకి రావడంతో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో మతపరమైన హింసకు గురై.. భారత్‌కు వలసవచ్చిన హిందువులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు, పార్శీలకు భారత పౌరసత్వం లభించనుంది. ఐదేళ్ల పాటు ఇక్కడ నివసించిన తర్వాత భారత పౌరసత్వం పొందనున్నారు.