iDreamPost
android-app
ios-app

HYDRA: సలకం చెరువులో ఓవైసీ కాలేజీ.. హైడ్రా నెక్ట్స్‌ టార్గెట్‌ అదేనా!

  • Published Aug 26, 2024 | 12:38 PM Updated Updated Aug 26, 2024 | 12:41 PM

HYDRA-Owaisi College In Salakam Pond: చెరువుల ఆక్రమణలపై దూకుడుగా వెళ్తున్న హైడ్రా తదుపరి లక్ష్యం.. ఓవైసీ కాలేజీనే అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ వివరాలు..

HYDRA-Owaisi College In Salakam Pond: చెరువుల ఆక్రమణలపై దూకుడుగా వెళ్తున్న హైడ్రా తదుపరి లక్ష్యం.. ఓవైసీ కాలేజీనే అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ వివరాలు..

  • Published Aug 26, 2024 | 12:38 PMUpdated Aug 26, 2024 | 12:41 PM
HYDRA: సలకం చెరువులో ఓవైసీ కాలేజీ.. హైడ్రా నెక్ట్స్‌ టార్గెట్‌ అదేనా!

తెలంగాణ ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ నగరంలో  జనాభా పెరిగిపోతుండడంతో ఇష్టానుసారంగా చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు కొందరు అక్రమార్కులు. సరైన పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో ఇన్నాళ్లుగా వారి ఆటలు అడ్డు అదుపు లేకుండా సాగాయి. కానీ సీఎం రేవంత్.. నగరంలో ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడానికి హైడ్రాను ఏర్పాటు చేయడంతో.. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి. మొదటి రోజు నుంచే హైడ్రా దూకుడుగా ముందుకు సాగుతుంది. అక్రమ నిర్మాణం అని తెలిస్తే చాలు కూల్చివేస్తుంది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా చర్యలు తీసుకుంటుంది.

ఇక ఇప్పటికే నాగార్జున ఎన్‌ కన్వెన్షన్‌ని కూల్చివేసిన హైడ్రా.. మరి కొందరు సెలబ్రిటీల అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించించదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే హైడ్రా నెక్స్ట్‌ టార్గెట్‌ ఓవైసీ బ్రదర్స్‌ అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఓవైసీ బద్రర్స్‌కు చెందిన అక్రమ కట్టడాలపై ఫిర్యాదులు రావడంతో..  ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. హైదరాబాద్‌ జిల్లా పాతనగరంలోని బండ్లగూడ మండల పరిధిలోని సలకం చెరువులో ఓవైసీ బ్రదర్స్‌ అక్రమంగా విద్యాసంస్థలు నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు చేశారు. చెరువును సగం ఆక్రమించి ఫాతిమా విద్యాసంస్థలు నిర్మించారని అసద్‌పై ఆరోపణలు ఉన్నాయి. చెరువులోనే బిల్డింగులు కనిపిస్తున్నా ఎందుకు కూల్చడంలేదని ట్విట్టర్‌ వేదికగా జనాలు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నెట్టింట వైరల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో హైడ్రా నెక్స్ట్‌ టార్గెట్‌ ఓవైసీ కాలేజీనే అంటున్నారు.

చెరువుగా గుర్తింపు..

హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ నిర్వహిస్తున్న లేక్‌ ప్రోటెక్షన్‌ వెబ్‌సైట్‌లో బండ్లగూడ మండల పరిధిలోని బండ్లగూడ కల్సా గ్రామ రెవెన్యూ పరిధిలోని సలకం చెరువుకు సంబంధించిన ఎఫ్‌టీఎల్‌ సరిహద్దులను గుర్తించి, కెడాస్ట్రల్‌ మ్యాప్‌లను రూపొందించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. లేక్‌ గుర్తింపు నంబరుగా 4001/1(13-12-2016) పేరుతో ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఈ చెరువులోనే ఓవైసీకి చెందిన విద్యాసంస్థ ఉన్నట్టుగా గూగుల్‌ మ్యాప్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే చిత్రాన్ని సోషల్‌ మీడియాలో పలువురు వైరల్‌ చేస్తున్నారు. మరి హైడ్రా దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అని జనాలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.