iDreamPost
android-app
ios-app

జగన్ పై ఓవైసీ ప్రశంసలు..వాళ్ల ఓట్లన్నీ గంపగుత్తగా!

జగన్ పై ఓవైసీ ప్రశంసలు..వాళ్ల ఓట్లన్నీ గంపగుత్తగా!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. కొత్త కొత్త పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారు. నాలుగేళ్లలో ఏపీని దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలబెట్టారు. సీఎం జగన్‌ ప్రవేశపెట్టిన చాలా పథకాలు దేశానికే స్పూర్తిగా నిలుస్తున్నాయి. సీఎం జగన్ ప్రజా రంజకమైన పాలన సాగిస్తూ.. క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇక ఆయన పరిపాలన గురించి ప్రతిపక్షాలు ఎన్ని విమర్శులు చేసినా…. ఇతర రాష్ట్రాల నుంచి మాత్రం మంచి ప్రశంసలు  అందుతున్నాయి. ఇప్పటికే వైఎస్ జగన్ పరిపాలనపై దేశంలోనే పలువురు రాజకీయ ప్రముఖులు ప్రశంసించగా.. తాజాగా ఏఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ  అసదుద్దిన్ ఓవైసీ కీలక కామెంట్స్ చేశారు.

ఇటీవలే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రెండు తెలుగు రాష్ట్రాల్లోని తన పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భవిష్యత్ లో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించారు. అంతేకాక  రాబోయే ఎన్నికల్లో  ఎలా ముందుకు వెళ్లాలని అనే అంశంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.  ఇక ఇదే సమావేశంలో ఏపీలో జగన్ పరిపాలన గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైఎస్ జగన్ మంచి పరిపాలన అందిస్తున్నారని ఓవైసీ కితాబిచ్చారు. ప్రజలకు వివిధ పథకాల ద్వారా ఆర్థిక చేయుత అందిస్తున్నారని తెలిపారు. ఇదే సమయంలో చంద్రబాబుపై కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. చంద్రబాబును ఎప్పటికీ నమ్మలేమని, అలానే ప్రజలు కూడా బాబును ఎప్పుడు నమ్మొద్దని  ఆయన విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.

రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రుడు చాలా సంతోషంగా ఉన్నారని ఓవైసీ వ్యంగ్యంగా అన్నారు. చంద్రబాబు ఎందుకు జైల్లో ఉన్నారో అందరికీ తెలుసుని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఏపీలో కూడా పోటీ చేసే ఆలోచన ఉన్నట్లు ఆయన చెప్పారు. ఇక వైఎస్ జగన్ పరిపాలనపై ఓవైసీ చేసిన కామెంట్స్ వైసీపీకీ రాజకీయంగా కలిసొచ్చే అంశమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ముస్లిం మైనార్టీలు వైసీపీకి గట్టి మద్దతుదారులుగా  ఉన్న విషయం తెలిసిందే.  ఇప్పుడు ఓవైసీ జగన్ విషయంలో సానుకూలంగా కామెంట్స్ తో మరోసారి వాళ్లంతా వైసీపీకీ గంపగుత్తుగా ఓట్లు వేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  మరి.. సీఎం జగన్ పాలనపై హైదరాబాద్ ఎంపీ ఓవైసీ చేసిన  వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.