తహసీల్దార్ వనజాక్షి మరోసారి వార్తల్లో నిలిచారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే పథకానికి సంబంధించి భూములు సేకరించేందుకు తహసీల్దార్ వనజాక్షి కృష్ణా జిల్లా తాడేపల్లి గ్రామానికి వెళ్లారు. భూములు ఇచ్చేందుకు సుముఖంగా లేని రైతులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ లక్ష్యాన్ని వివరిస్తూ భూములు ఇవ్వాలని కోరారు. అయితే పలువురు భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. భూముల సేకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఎమ్మార్వో వనజాక్షి.. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వెనక్కి వెళ్లాలని అన్నట్లుగా సమాచారం. […]