iDreamPost
android-app
ios-app

విడాకులు ఇవ్వమంటే వినలేదు.. ఆగ్రహంతో రగిలిపోయిన భర్త.. చివరకు భార్యను

  • Published Jul 13, 2024 | 9:56 AM Updated Updated Jul 13, 2024 | 9:56 AM

భర్త ఏమో భార్యాబిడ్డల కోసం దూరాభారం లెక్క చేయక.. ఎక్కడెక్కడికో వెళ్లి పనులు చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మరి భర్త కష్టాన్ని అర్థం చేసుకోవాల్సి.. తోడుగా నిలవాల్సిన భార్య.. దారి తప్పింది. చివరకు ఏం జరిగింది అంటే..

భర్త ఏమో భార్యాబిడ్డల కోసం దూరాభారం లెక్క చేయక.. ఎక్కడెక్కడికో వెళ్లి పనులు చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మరి భర్త కష్టాన్ని అర్థం చేసుకోవాల్సి.. తోడుగా నిలవాల్సిన భార్య.. దారి తప్పింది. చివరకు ఏం జరిగింది అంటే..

  • Published Jul 13, 2024 | 9:56 AMUpdated Jul 13, 2024 | 9:56 AM
విడాకులు ఇవ్వమంటే వినలేదు.. ఆగ్రహంతో రగిలిపోయిన భర్త.. చివరకు భార్యను

వారికి కొన్నాళ్ల క్రితం వివాహం అయ్యింది. ఇద్దరు సంతానం ఉన్నారు. భార్యాబిడ్డలను పోషించడం కోసం ఆ వ్యక్తి ఎక్కడెక్కడో పనులు చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇక భర్త కష్టం అర్థం చేసుకుని.. ఆయనకు చేదోడువాదోడుగా నిలవాల్సిన భార్య దారి తప్పింది. ఆమె గురించి భర్తకు తెలిసి ఎంతో బాధపడ్డాడు. మారమని సలహా ఇచ్చాడు. కానీ ఆమె వినలేదు. చివరకు విడాకులు ఇవ్వమని కోరాడు. అందుకు ఆ భార్య అంగీకరించలేదు. ఆగ్రహంతో విసిగిపోయిన భర్త.. దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఆ వివరాలు..

వివాహేతర సంబంధం దంపతుల మధ్య చిచ్చు పెట్టింది. మారమని భార్యను కోరాడు భర్త. కానీ ఆమె అతడి మాటలు వినలేదు. దాంతో విడాకులు ఇవ్వమని అడిగాడు. అందుకు కూడా అంగీకరించలేదు. భార్య తీరుతో విసిగిపోయిన భర్త.. పార్క్‌కు వెళ్దాం రమ్మని పిలుచుకు వెళ్లి భార్యను చంపి.. ఇసుకలో పూడ్చి పెట్టాడు. ఆ తర్వాత పోలీసులు వద్దకు వెళ్లి లొంగిపోయాడు. ప్రొద్దుటూరులో శుక్రవారం నాడు ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రొద్దుటూరు, అమృతనగర్‌కు చెందిన అన్వర్‌బాషా, మైలవరం మండలం దొడియం గ్రామానికి చెందిన రేష్మ (25)లకు పదేళ్ల కిందట వివాహం అయ్యింది.  వీరికి కుమార్తె, కుమారుడు.. ఇద్దరు సంతానం ఉన్నారు. ఇక అన్వర్‌బాషా పొక్లెయిన్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పని నిమిత్తం ఎక్కువగా బయటే ఉండేవాడు. ఈ క్రమంలో భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొన్నాళ్ల తర్వాత.. భార్య చేస్తోన్న తప్పు.. భర్తకు తెలిసింది. ఈవిషయమై దంపతుల మధ్య అనేక సార్లు గొడవ కూడా జరిగింది. తీరు మార్చుకోవాలంటూ. అన్వర్‌ పలుమార్లు ఆమెను మందలించాడు. అయినా లాభం లేకుండా పోయింది. రేష్మలో ఎలాంటి మార్పు రాలేదు. ఆమె తీరుతో విసిగిపోయిన అన్వర్‌..  విడాకులివ్వాలని కోరాడు. అందుకు కూడా ఆమె అంగీకరించలేదు. ఈ విషయమై పదిరోజుల క్రితం కూడా వీరి మధ్య గొడవ జరిగింది.

గొడవ జరిగిన తర్వాత రేష్మ ఈశ్వర్‌రెడ్డి నగర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లి అక్కడే ఉంటోంది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఈశ్వర్‌రెడ్డినగర్‌కు వెళ్లిన అన్వర్‌ బాషా మాట్లాడాలంటూ భార్యను పార్కుకు తీసుకెళ్లాడు. కొద్దిసేపు ఏకో పార్కులోనే గడిపిన అనంతరం పార్కు ఎదురుగా ఉన్న కంప చెట్లలోకి తీసుకెళ్లి ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అక్కడే గొయ్యి తీసి పూడ్చి ఇసుకతో కప్పేశాడు.
ఆ తరువాత నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని వారికి చెప్పాడు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. నిందితుడిని వెంట తీసుకుని ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇసుకలో పూడ్చిపెట్టిన రేష్మ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbahsegel girişgrandpashabet