Dharani
ఏపీలో పెన్షన్లు తీసుకునే వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేటి నుంచి ఇది అమల్లోకి రానుంది. ఆ వివరాలు..
ఏపీలో పెన్షన్లు తీసుకునే వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేటి నుంచి ఇది అమల్లోకి రానుంది. ఆ వివరాలు..
Dharani
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీ గందరగోళంగా మారింది. గత కొన్నేళ్లుగా వాలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి లబ్ధిదారులకు నెల ఫస్ట్ తారీఖున పింఛన్ అందజేసేవారు. కానీ ఈనెల టీడీపీ కుట్ర వల్ల వాలంటీర్లు పింఛన్ పంపిణీ చేసే అవకాశం లేదు. దాంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక పింఛన్ కోసం వచ్చి పలువురు చనిపోయిన సంగతి తెలిసిందే. వడదెబ్బ కారణంగా వారు మరణించారు. ఓవైపు రాష్ట్రంలో ఎండలు మండిపోతుండటంతో.. పింఛన్ పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీని వల్ల లబ్ధిదారులకు భారీ ఊరట కలగనుంది. ఆ వివరాలు..
పింఛన్ పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వేసవి, వేడి గాలుల తీవ్రత ఉండటంతో నేడు అనగా గురువారం నుంచి ఉదయం 7 గంటల నుంచే సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు, దివ్యాంగులు వంటి వారికి తప్పనిసరిగా ఇంటి వద్దే పింఛను అందించేలా నిబంధనలు సవరించినట్లు వెల్లడించారు.
తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పింఛన్‌దారులు పింఛన్ కోసం సచివాలయాల వద్దకు రానవసరం లేదని.. వారికి ఇంటి వద్దే పింఛను అందజేస్తారని.. శశిభూషణ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టర్లందరికీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అయితే బుధవారం మధ్యాహ్నం తర్వాత పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందని కొత్త మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. తాజా మార్గదర్శకాల గురించి ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసినా.. ఇంటికే పరిమితమయ్యే అవ్వాతాతలకు స్పష్టంగా తెలియలేదు. దీంతో లబ్దిదారులు బుధవారం ఉదయం నుంచే గ్రామ, వార్డు సచివాలయాల వద్దకు చేరుకోవడంతో కొంత గందరగోళం నెలకొందని అధికారులు తెలిపారు
ఏప్రిల్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 66 లక్షల మందికి పింఛన్ల పంపిణీ చేయాలి. బుధవారం మధ్యాహ్నం నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. ఏప్రిల్ 6 వరకు అనగా మరో మూడు రోజులు సచివాలయాల వద్ద పింఛన్ పంపిణీ చేస్తారు. ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదని.. అందరికి పింఛన్ అందుతుందని అధికారులు తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు సచివాలయాల దగ్గరకు రావాల్సిన అవసరం లేదంటున్నారు.