Krishna Kowshik
2018లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో ఆందోళన చెందుతున్నారు ఉద్యోగులు.
2018లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో ఆందోళన చెందుతున్నారు ఉద్యోగులు.
Krishna Kowshik
గ్రూప్ 1 పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో వివాదాలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. మొన్నటి మొన్న తెలంగాణలో పలుమార్లు గ్రూప్ 1 పరీక్షలు రద్దు అయిన సంగతి విదితమే. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష రద్దు అయ్యింది. 2018లో జరిగిన గ్రూప్ 1 పరీక్ష పేపర్ల మూల్యంకనంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ ప్రశ్నా పత్రాలను మాన్యువల్ విధానంలో రెండు సార్లు మూల్యాంకనం చేశారని పేర్కొంటూ కొంత మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. రెండు, మూడు సార్లు కరెక్షన్ చేయడం చట్ట విరుద్ధమని పేర్కొంటూ.. ఆ పరీక్షలు చెల్లవని తీర్పునిచ్చింది. అలాగే ఎంపికైన అభ్యర్థలు జాబితాను రద్దు చేసింది.
టీడీపీ నేతృత్వంలో నారా చంద్ర బాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 2018లో గ్రూప్ 1 పరీక్షలు జరిగాయి. 167 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఏపీపీఎస్సీ. అయితే ఆన్సర్ షీటును డిజిటల్ ఎవాల్యూయేషన్ తర్వాత మాన్యువల్ విధానంలో రెండు సార్లు మూల్యాంకనం చేశారని, మొదటి సారి దిద్దిన ఫలితాలను దాచి పెట్టి.. రెండోసారి కరెక్షన్ చేసి, అప్పుడు ఫలితాలు వెల్లడించారని పేర్కొంటూ కొంత మంది అభ్యర్థులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కాగా, తాము నిబంధన ప్రకారమే మూల్యాంకనం నిర్వహించామని వాదించింది ఏపీపీఎస్సీ. ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ధర్మాసనం గ్రూప్ -1 మెయిన్స్ రద్దు చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను కూడా రద్దు చేస్తూ.. మళ్లీ పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది.
ఆరు నెలల్లోపు పరీక్షలు నిర్వహించాలంటూ తీర్పు నిచ్చింది హైకోర్టు. అయితే ఈ ఫలితాల తర్వాత ఆ ఏడాది ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన వారిలో ఆందోళన నెలకొంది. గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేయడంతో.. వీరి ఉద్యోగం.. భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అయితే ఆ ఉద్యోగులకు భరోసా నిస్తోంది జగన్ ప్రభుత్వం. ఈ తీర్పుపై ఆందోళన వద్దని చెబుతోంది. 2018లో గ్రూప్ ఫలితాల్లో ఎన్నికై.. ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగుతున్న ఎంప్లాయిస్ అండగా నిలుస్తామని చెబుతోంది. వారి ఉద్యోగ ప్రయోజనాలను కాపాడి తీరుతామని అంటోంది. ఈ తీర్పుపై అప్పీల్ కు వెళతామని ప్రకటించింది వైసీపీ ప్రభుత్వం. కాగా, ఈ తీర్పుతో.. ఇప్పటి అభ్యర్థుల్లో కూడా ఆందోళన నెలకొంటోంది.