iDreamPost
android-app
ios-app

Holidays: విద్యార్థులు, ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ లో 8 రోజులు సెలవులు

  • Published Aug 31, 2024 | 10:00 AM Updated Updated Aug 31, 2024 | 10:00 AM

School Holidays List In September 2024: సాధారణంగా ప్రతి నెల స్కూళ్లు, కాలేజీలకు ఎన్నో కొన్ని రోజులు సెలవులు వస్తుంటాయి. పండగలు అవి ఉంటే.. మరి కొన్ని రోజులు ఎక్కువ రోజులు వస్తాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ లో 8 రోజులు సెలవులు వచ్చాయి. ఆ వివరాలు..

School Holidays List In September 2024: సాధారణంగా ప్రతి నెల స్కూళ్లు, కాలేజీలకు ఎన్నో కొన్ని రోజులు సెలవులు వస్తుంటాయి. పండగలు అవి ఉంటే.. మరి కొన్ని రోజులు ఎక్కువ రోజులు వస్తాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ లో 8 రోజులు సెలవులు వచ్చాయి. ఆ వివరాలు..

  • Published Aug 31, 2024 | 10:00 AMUpdated Aug 31, 2024 | 10:00 AM
Holidays: విద్యార్థులు, ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ లో 8 రోజులు సెలవులు

సాధారణంగా ప్రతినెలా స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఉంటాయి. రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలు కాకుండా.. పండగలు లాంటివి ఉంటే మరి కొన్ని అదనపు సెలవులు వస్తాయి. ఇక వర్షాకాలంలో అయితే స్కూల్ హాలీడేస్ సంఖ్య పెరుగుతుంది. భారీ వర్షాలు కురిస్తే విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తారు. అలానే ఆగస్టు నెలలో విద్యార్థులకు భారీగా సెలవులు వచ్చాయి. పండగలు మాత్రమే కాక.. ఆగస్టులో భారీగా వానలు కురవడంతో.. వరుసపెట్టి విద్యార్థులకు సెలవులు వచ్చాయి. ఇక రేపటి నుంచి అనగా ఆదివారం నుంచి సెప్టెంబర్ నెల ప్రారంభం అవుతుంది.  ఈ నెల కూడా రెండు పెద్ద పండగలు ఉన్నాయి. దాంతో సెప్టెంబర్ నెలలో విద్యార్థులకు 8 రోజులు సెలవులు రానున్నాయి ఆ జాబితా మీ కోసం..

ఇక సెప్టెంబర్‌ నెలలో ముఖ్యమైన పండుగ వినాయక చవితి. ఈ సారి గణేస్ చతుర్థి.. సెప్టెంబర్ 7 అనగా శనివారం నాడు వస్తుంది. ఆ రోజు విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ఉంటుంది. అలాగే మరుసటి రోజు ఆదివారం. దాంతో.. వరుసగా రెండు రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఘనంగా జరుపుకుంటారు. దాంతో ఏపీ, తెలంగాణలో వినాయక చవితి సందర్భంగా సెలవు ఉంటుంది.

8 Days holidays in SEP

అలాగే.. సెప్టెంబర్‌లో మరో రోజు కూడా పబ్లిక్‌ హాలిడేగా ప్రకటించింది ప్రభుత్వం. మిలాద్-ఉన్-నబీ లేదా ఈద్-ఎ-మిలాద్ పండుగను సెప్టెంబర్ 16న జరుపుకుంటారు. ఈ పండుగను ముహమ్మద్ ప్రవక్త పుట్టినరోజుగా గుర్తించారు. నబీ డే లేదా మౌలిద్ అని కూడా అంటారు. ఈ రోజు అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూసి ఉంటాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సెప్టెంబర్‌ 16 సోమవారం వస్తుంది. దానికి ముందు వరుసగా.. రెండు రోజులు సెలవులు. ఎందుకంటే. సెప్టెంబర్ 14న రెండో శనివారం, 15న ఆదివారం, 16న ఈద్-ఎ-మిలాద్ సందర్భంగా సోమవారం సెలవు. దాంతో వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి.

సెప్టెంబర్ 17 సెలవు..?

అయితే వినాయక నిమజ్జనం సందర్భంగా కూడా హైదరాబాద్ లో సెలవు ఇస్తారు. ఇక ఈసారి సెప్టెంబర్ 17న వినాయక నిమజ్జనం రానుంది. దాంతో ఆ రోజు కూడా సెలవు ఉంటుంది. అలా చూసుకుంటే.. హైదరాబాద్ లో వరుసగా 4 రోజులు సెలవులు వస్తాయి. 14 రెండో శనివారం, 15 ఆదివారం, 16 సోమవారం నాడు ఈద్-ఎ-మిలాద్, 17న వినాయక నిమజ్జనం సెలవు. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సెప్టెంబర్ నెలలో సెలవుల జాబితా ఇదే..

  • సెప్టెంబర్ 1 ఆదివారం స్కూల్స్, కాలేజీలకు సెలవు
  • సెప్టెంబర్ 7 శనివారం వినాయక చవితి హాలిడే. అందరికీ సెలవు
  • సెప్టెంబర్ 8 ఆదివారం అందరికీ సెలవు.
  • సెప్టెంబర్ 15 ఆదివారం సెలవు
  • సెప్టెంబర్ 16 మీలాద్ ఉన్ నబి పబ్లిక్ హాలిడే. స్కూల్స్‌కు సెలవు
  • సెప్టెంబర్ 22 ఆదివారం అందరికీ సెలవు
  • సెప్టెంబర్ 28 నాలుగో శనివారం కొన్ని స్కూళ్లకు సెలవు
  • సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం అందరికీ సెలవు