iDreamPost
android-app
ios-app

Rain Alert: IMD అలర్ట్‌.. బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మరో 5 రోజులు భారీ వర్షాలు

  • Published Jul 14, 2024 | 2:08 PMUpdated Jul 14, 2024 | 2:08 PM

IMD Heavy Rain Alert To AP And Telangana: రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అధికారులు కీలక అలర్ట్‌ జారీ చేశారు. రానున్న 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. ఆ వివరాలు..

IMD Heavy Rain Alert To AP And Telangana: రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అధికారులు కీలక అలర్ట్‌ జారీ చేశారు. రానున్న 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. ఆ వివరాలు..

  • Published Jul 14, 2024 | 2:08 PMUpdated Jul 14, 2024 | 2:08 PM
Rain Alert: IMD అలర్ట్‌.. బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మరో 5 రోజులు భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాల కారణంగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. జూన్‌ నెల ప్రారంభం‍లోనే రుతు పవనాలు విస్తరించినా.. వర్షాలు మాత్రం అనుకున్న మేర పడలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులే నెలకొని ఉన్నాయి. అయితే జూలై నెలలో జోరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ నెలలో సగం రోజులు పూర్తయ్యాయి. కానీ ఆశించిన మేర వర్షాలు పడలేదు. కానీ రానున్న పదిహేను రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు బంగాళాఖాతంలో అల్పపీనడం ఏర్పడిందని.. దాంతో రానున్న 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఐఎండీ కీలక అలర్ట్‌ జారీ చేసింది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఏపీ తీరంలో సముద్ర మట్టానికి సగటున 5.8 కిమీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించిన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు అనగా.. ఆది, సోమ రెండు రోజులు.. తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు ​​కురుస్తాయని చెప్పుకొచ్చింది. అలానే మంగళ, బుధవారాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని రెండు రాష్ట్రాల వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు నమోదవుతున్నాయి. బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుంది. ఇది కాస్తా విశాఖపట్నం-భువనేశ్వర్ మధ్య తీరాన్ని తాకనుంది. మరోవైపు నైరుతి రుతు పవనాలు ఇప్పటికే రాష్ట్రమంతా బలపడి ఉన్నాయి. దాంతో మధ్య ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఈశాన్య అస్సోం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకూ రెండు ద్రోణులు కూడా కొనసాగుతున్నాయి. ఫలితంగా రేపు, ఎల్లుండి అంటే సోమ, మంగళవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చని.. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు..

భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు అత్యవసర సహాయక చర్యల కోసం విపత్తుల నిర్వహణ సంస్థలో 24గంటలు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నెంబర్లు 1070, 112, 18004250101 సంప్రదించాలన్నారు.

ఇక తెలంగాణలో చూస్తే ఇవాళ నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. జులై 15-16వ తేదీ ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ముఖ్యంగా సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఈ ప్రభావం ఉండవచ్చని చెప్పడమే కాక.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసింది. భారీ వర్షాల కురవనున్న నేపథ్యంలో జనాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి