Dharani
ఎన్నికల పోలింగ్ వేళ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓటేయడానికి వచ్చిన ఓ మహిళ పోలింగ్ కేంద్రంలోనే కుప్ప కూలింది. ఆ వివరాలు..
ఎన్నికల పోలింగ్ వేళ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓటేయడానికి వచ్చిన ఓ మహిళ పోలింగ్ కేంద్రంలోనే కుప్ప కూలింది. ఆ వివరాలు..
Dharani
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. మే 13, సోమవారం ఉదయం నుంచే ఏపీ, తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచే ఓటేసేందుకు జనాలు క్యూ లైన్లో నిల్చున్నారు. గతంలో పోలిస్తే.. ఈ సారి ఓటేసేందుకు జనాలు పోటెత్తారు. పైగా ఈ రోజు వాతావరణం కాస్త చల్లబడటం కూడా కలిసి వచ్చింది. పోలింగ్ ముందు రెండు రోజులు సెలవులు రావడంతో.. జనాలు ఓటేసేందుకు సొంత ఊర్లకు తరలి వెళ్లారు. ఇక సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా పోలింగ్ నమోదయ్యింది. ఇక ఇలా ఉండగా.. పోలింగ్ వేళ కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. ఇక ఓటేయడానికి వచ్చిన ఓ మహిళ క్యూ లైన్లోనే కుప్పకూలి మృతి చెందింది. ఆ వివరాలు..
ఓటేసేందుకు క్యూలైన్‌లో నిలబడిన ఓ వృద్ధురాలు అక్కడే కుప్పకూలి మృతి చెందింది. ఈ సంఘటన సోమవారం విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలం, తంగుడుబిల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఊరికి చెందిన పాలూరి పెంటమ్మ అనే 65 ఏళ్ల మహిళ.. ఓటు వేసేందుకు క్యూలైన్లో నిల్చుంది. ఇంతలో ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్ప కూలి కిందపడిపోయింది. ఆవెంటనే ఆమె కన్ను మూసింది. ఈ సంఘటనతో అక్కడున్న వారు ఆందోళన చెందారు. వెంటనే పెంటమ్మ మృతదేహాన్ని ఆమె ఇంటికి తీసుకె ళ్లారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇక తెలంగాణలో కూడా ఓ పోలింగ్ కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ఎన్నికల విధులు నిర్వహిస్తోన్న సిబ్బంది ఒకరు గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషాదకర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేటలోని నెహ్రు నగర్‌లో చోటు చేసుకుంది. శ్రీకృష్ణ అనే ఉద్యోగి ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఏమైందో తెలుసుకునేలోపే మృతి చెందాడు. శ్రీకృష్ణ గుండెపోటుతో మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఈ ఘటనతో పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ఆగిపోయింది. అధికారులు వెంటనే ఆయన మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం.. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇక ఇప్పటి వరకు ఏపీలో సుమారు కోటి 70 లక్షల మంది ఓటేశారు. రాయలసీమ జిల్లాల్లో అత్యధిక ఓటింగ్ నమోదు కాగా.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో తక్కువ ఓటింగ్ నమోదయ్యింది. ఇప్పటి వరకు ఏపీలో 55 శాతం పోలింగ్ నమోదయ్యింది. పాడేరులో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది.