పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలో వెలుగులోకి వచ్చిన అంతుచిక్కని వ్యాధిపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, రాష్ట్ర, కేంద్రం నుంచి వచ్చిన వైద్య నిపుణులు, వివిధ పరిశోధనా సంస్థల శాస్త్రవేత్తలతో సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. బాధితుల సంఖ్య, కొత్తగా నమోదైన వారి వివరాలు, ఈ వ్యాధి రావడానికి […]
కరోనా వైరస్ సృష్టించిన కల్లోలానికి సమర్థవంతగా అడ్డుకట్ట వేసిన ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్ సర్కార్.. వైరస్ సోకిన బాధితులకు ఉచితంగా చికిత్సను అందించింది. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల మరణాల రేటుతోపాటు క్రమంగా పాజిటివ్ రేటు కూడా భారీగా తగ్గింది. రాష్ట్రంలో 8 లక్షలకు పైబడి ప్రజలు కరోనా వైరస్ బారినపడి కోలుకున్నారు. వైరస్ తగ్గిన తర్వాత పలు అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. ఊపిరితుత్తుల సమస్య, షుగర్ తదితర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్న […]
కరోనా కష్ట కాలంలో ఆంద్రప్రదేశ్ ప్రజలకు భారీ ఉపశమనం కలిగేలా జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటతే ఆరోగ్యశ్రీ పథకం వర్తింపు చేయడం మరో ఆరు జిల్లాలకు విస్తరించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో అమలవుతోన్న ఈ పథకం ఈ నెల 16వ తేదీ నుంచి కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో అమలు చేయాలని ఆదేశించారు. వైద్యం […]
కరోనా వైరస్ ను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తు జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం ఎంతగా పాపులరయ్యిందో అందరికీ తెలిసిందే. ప్రపంచం మొత్తాన్ని వణికించేస్తున్న ఈ వైరస్ మనదేశంలో కూడా వ్యాపిస్తోంది. ఇందులో భాగంగా ఏపిలో కూడా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. అసలే పేద ప్రజలు ఎక్కువగా ఉన్న ఈ రాష్ట్రంలో కరోనా కూడా సోకితే అంతే సంగతులు. ఈ విషయమై అన్నీ కోణాల్లో చర్చించిన తర్వాత సోమవారం రాత్రి జరిగిన […]
కరోనా వైరస్ ఇప్పుడు దేశాన్ని,అధికారులను, సామాన్య ప్రజలనూ వణికిస్తుంది. వైరస్ ధాటికి చైనా,ఇటలీ,ఇరాన్ దేశాలు అతలాకుతలం అయ్యాయి. చైనాలో వైరస్ వ్యాప్తి తగ్గింది కానీ ఇటలీలో మాత్రం కట్టడి కావడం లేదు. అలాంటి పరిస్థితి రాకుండా భారత దేశ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన ఆంక్షలను అమలు చేస్తూ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని చూస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ఢిల్లీ,నాగపూర్ వంటి నగరాల్లో కర్ఫ్యూ విధించాయి. కాగా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో కరోనా కేసు […]
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న మహమ్మరి కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో కూడా అలజడి సృష్టిస్తోంది. జలుబు, దగ్గుతో మొదలై తీవ్ర జ్వరం వరకూ వెళ్లి చివరకు ప్రాణాంతకమవుతున్న ఈ మహమ్మరిని ఆదిలోనే అడ్డుకునేందుకు ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వం కరోనా పై పత్య్రేక దృష్టి సారించింది. కరోనా లక్షణాలుతో ఎవరైనా బాధపడుతుంటే ముందుగానే తెలుసుకునేందుకు వాలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేయించింది. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు […]
వైఎస్ రాజశేఖరరెడ్డి… ఆంధ్రప్రదేశ్ చరిత్రలో.. తెలుగు ప్రజల మనస్సుల్లో చిరకాలం నిలిచిపోయే పేరు. పేద, మధ్యతరగత ప్రజల జీవితాలను మార్చాలని తప్పనపడిన ఏకైక నాయకుడు. తపన పడడమేకాదు.. అందు కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి కూడా. స్వాతంత్య్రం వచ్చి దశాబ్ధాలు గడుస్తున్న నేటికీ పేదరికంలో మగ్గుతూ… విద్యకు, వైద్యానికి దూరమైన కుటుంబాలకు వాటిని దగ్గర చేసి పేదరికాన్ని ప్రాలదొలేందుకు నడుంబిగించిన మహనీయుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాల వల్ల లబ్ధిపొందిన వారు ఇప్పటికీ చెబుతుంటారు. ఆ […]
ఫ్రీ ఫోన్ తో సర్కారీ నిఘా పేరుతో ఆంధ్రజ్యోతి ఒక వార్తను ప్రచురించింది… ఫోన్ ఇచ్చారు.. పీక పట్టారు.. వారి ఫోన్లలో ఎండీఎం సాఫ్ట్వేర్, గోప్య సమాచారం గుప్పిట్లో.. కోట్లాది ప్రజల డేటా సర్వర్లకు ప్రైవేటుకు చేరితే ఏమిటి గతి?.. టెక్ నిపుణుల తీవ్ర ఆందోళన ఇలా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రతీ అక్షరంలో వెళ్లగక్కిన ఆంధ్రజ్యోతి అంతిమంగా మరోసారి అవాస్తవ వార్తను ప్రచురించింది. గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శి, సర్వేయర్, వలంటీర్, పట్టణ వార్డు సచివాలయాల్లో […]
అత్యంత ప్రమాదకరమైన జబ్బుల్లో క్యాన్సర్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాలు ఏటికేడూ పెరుగుతూనే ఉన్నాయి. మనిషి శరీరంలోని ముఖ్యమైన భాగాల్లోని కణజాలాన్ని నాశనం చేసి చావుకు దగ్గరకు చేస్తుంది. క్యాన్సర్ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం కావడం వల్ల మరణాల శాతం అధికంగా ఉంటోంది. మరీ ముఖ్యంగా భారతదేశంలో క్యాన్సర్ ఈ దశాబ్ధంలో విజృంభిస్తోంది. ఒక్క 2018 సంవత్సరంలోనే కొత్తగా 11.6 లక్షల మంది క్యాన్యర్ వ్యాధిగ్రస్తులు నమోదైనట్లు తేలింది. పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువగా ఈ మహమ్మారి […]
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాటలోనే ఆంధ్రప్రదేశ్లో నవ, యువ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పయనిస్తున్నారా..? సంక్షేమ పథకాలకు పేర్లు పెట్టడంతో చంద్రబాబును ఆదర్శంగా తీసుకుంటున్నారా..? అంటే అవుననే విశ్లేషకుల నుంచి సమాధానం వస్తోంది. టీడీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు పేరును సంక్షేమ పథకాలకు ఎలా పెట్టారో.. ఇలాగే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కూడా సీఎం జగన్ పేరును సంక్షేమ పథకాలకు పెడుతున్నారని వారు పేర్కొంటున్నారు. ఏ ప్రభుత్వమైనా.. సీఎం పేరును పథకాలకు పెట్టడం ఎవరూ హర్షించబోరని […]