Idream media
Idream media
కరోనా వైరస్ సృష్టించిన కల్లోలానికి సమర్థవంతగా అడ్డుకట్ట వేసిన ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ సర్కార్.. వైరస్ సోకిన బాధితులకు ఉచితంగా చికిత్సను అందించింది. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల మరణాల రేటుతోపాటు క్రమంగా పాజిటివ్ రేటు కూడా భారీగా తగ్గింది. రాష్ట్రంలో 8 లక్షలకు పైబడి ప్రజలు కరోనా వైరస్ బారినపడి కోలుకున్నారు. వైరస్ తగ్గిన తర్వాత పలు అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. ఊపిరితుత్తుల సమస్య, షుగర్ తదితర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్న తరుణంలో వైఎస్ జగన్ సర్కార్ బాధితులందరికీ భరోసా ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది.
కోవిడ్ తగ్గిన తర్వాత తలెత్తే అనారోగ్యాలకు చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టు కోవిడ్ పేరిట ఆరోగ్యశ్రీలో సరికొత్త ఆప్షన్‌ను ఏర్పాటు చేసింది. కోవిడ్‌కు గురై కోలుకున్న వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు. గరీష్టంగా వారం రోజుల పాటు ఆస్పత్రిలో ఉండొచ్చు. చికిత్సకు రోజుకు 2,930 రూపాయలు చొప్పన ఫీజులు చెల్లించనుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజుకు రెండు వేల చొప్పన నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 8,35,468 మందికి వైరస్‌సోకింది. ఇందులో 8,06875 మంది కోలుకున్నారు. 6,768 మంది ప్రాణాలు కోల్పోగా.. ప్రస్తుతం 21,825 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రోజుకు పది వేల చొప్పన నమోదైన కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతూ.. ప్రస్తుతం రోజుకు రెండు వేల చొప్పున నమోదవుతున్నాయి.