iDreamPost
android-app
ios-app

ఆరోగ్యశ్రీలో మ‌రో సంచ‌ల‌నం.. రూ.25 ల‌క్షల వ‌ర‌కు ఉచిత వైద్యం!

  • Published Dec 07, 2023 | 9:29 AM Updated Updated Dec 07, 2023 | 10:42 AM

ఆంధ్రప్రదేశ్ లో ప్రజాసంక్షేమం విషయంలో సీఎం జగన్ ఎన్నో నూతన పథకాలను ప్రవేశ పెడుతూ ప్రజలకు అండగా ఉంటున్నారు. ముఖ్యంగా వైద్య, విద్యా, వ్యవసాయ రంగానికి పెద్ద పేట వేస్తూ పాలన కొనసాగిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రజాసంక్షేమం విషయంలో సీఎం జగన్ ఎన్నో నూతన పథకాలను ప్రవేశ పెడుతూ ప్రజలకు అండగా ఉంటున్నారు. ముఖ్యంగా వైద్య, విద్యా, వ్యవసాయ రంగానికి పెద్ద పేట వేస్తూ పాలన కొనసాగిస్తున్నారు.

ఆరోగ్యశ్రీలో మ‌రో సంచ‌ల‌నం.. రూ.25 ల‌క్షల వ‌ర‌కు ఉచిత వైద్యం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఎన్నో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో మంచి పేరు సంపాదించారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ది ప్రభుత్వ లక్ష్యం అంటూ పరిపాలనలో దూసుకువెళ్తున్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తూ.. మహిళా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు పరుస్తున్నారు. ఏపీలో పేద ప్రజలకు వైద్యం అందని ద్రాక్ష కాకూడదు అంటూ ఆరోగ్య శ్రీ పథకాన్ని పూర్తి స్థాయిలో బలోపేతం చేసేందుకు ఎప్పిటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ శుభవార్త తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ నెల 18 నుంచి కొత్త కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త కార్డు ద్వారా ఏకంగా రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం సదుపాయం ఉంటుంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించారు.  ఈ సందర్భంగా మంత్రి విడుదల రజిని మాట్లాడుతూ.. పేద ప్రజల ఆరోగ్యం కోసం ఏపీ సర్కార్ ఎన్నో చర్యలు తీసుకుంటుంది.  ఆరోగ్యశ్రీ తో పాటు ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్యశ్రీ సురక్ష తదితర సేవలు అన్నీ ఒకే చోట అందించబోతున్నాం. ఏపీలో ప్రతి పేద కుటుంబానికి ఈ కార్డు ఉపయోగపడాలన్నీదే ప్రభుత్వం లక్ష్యం అని అన్నారు. అంతేకాదు ఏపీలో ప్రతి పౌరుడి సెల్ ఫోన్ లో ఆరోగ్యశ్రీ, దిశా యాప్ లు ఖచ్చితంగా ఉండేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

ఏపీలో ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేయడం ఏపీ సర్కార్ ముఖ్య ఉద్దేశ్యం. ఆరోగ్యశ్రీ, జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్.. డేటా మొత్తం ఒకే చోట ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.  త్వరలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘జగన్న ఆరోగ్య సురక్ష’ రెండో దశ కార్యక్రమానికి శ్రీకారం చుడతారని మంత్రి విడుదల రజినీ తెలిపారు. ప్రతి గ్రామంలోనూ క్యాంపులు నిర్వహిస్తు.. పరీక్షలు నిర్వహించేలా ఏర్పాటు చేయాలని, ప్రజల ఆరోగ్యంపై భరోసా కల్పించాలని అధికారులకు సూచించారు. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చేలా ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకుంటున్నారిన తెలిపారు. ఇకపై పేద ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే ఉద్దేశ్యంతో రూ.25 లక్షల విలువై చికిత్సలు సైతం ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.