iDreamPost
android-app
ios-app

జగన్ చెప్పేసినట్లేనా..?

జగన్ చెప్పేసినట్లేనా..?

ఏలూరు లో జరిగిన ఆరోగ్య శ్రీ కార్యక్రమంలో జగన్ రాజధాని పై నర్మ గర్భ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పథకాలన్నీ కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కడికి చేరాలి, అభివృద్ధి ఫలాలు అందరికి సామానంగా అందాలి, ప్రభుత్వాలు కూడా పరిపాలనా ఫలాలు వీళ్ళందరికీ సమానంగా అందించాలి, అందరూ బాగుండాలి అన్ని ప్రాంతాలు బాగుండాలి, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ఇదే ప్రాతిపాదకన జరుగుతుందని చెప్పారు.

గ్రామ పరిపాలన నుండి రాష్ట్ర పరిపాలన వరకు అందరూ సమానమే, అందరికి నీళ్లు నిధులు పరిపాలన సమానంగా దక్కితేనే న్యాయమని నమ్ముతూ.. రాష్ట్రంలో అత్యున్నత పాలన పరంగానూ అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నామని, గతంలో తీసుకున్న అన్యాయమైన నిర్ణయాలను సరి దిద్దుతామని, అన్ని ప్రాంతాలు అన్నదమ్ముల్లా ఉండేలా, అనుబంధాలు ఎప్పటికి నిలిచేలా మీరిచ్చిన అధికారాన్ని దేవుడి దయతో వచ్చిన ఈ పదవిని అందరి అభివృద్ధికి ఉపయోగిస్తామని జగన్ మోహన్ రెడ్డి స్ఫష్టం చేశారు.

ఈ నేపథ్యంలో రాజధానిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరోక్షంగా క్లారిటీ ఇచ్చారని చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజధాని ఆందోళనలు నేపథ్యంలో ఈరోజు ఏలూరు లో జరిగిన ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో జగన్ చేసిన వ్యాఖ్యలు మరికొద్ది సేపటిలో ఈరోజు 3:30 ప్రాంతంలో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ తన నివేదికను అందించనున్న నేపథ్యంలో జగన్ ఈ వ్యాఖ్యలు చెయ్యడం ప్రాధాన్యతని సంతరించుకుంది. ఆయన ఈవిధంగా వ్యాఖ్యానించడం ద్వారా జగన్ వైఖరి స్పష్టమైందని, దానికి తగ్గట్టే రాజధాని తరలింపుకు అందరిని మానసికంగా సిద్ధం చేస్తున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా రాజధాని తరలింపుకు సిద్ధమైందని ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని స్పష్టంగా అర్ధమవుతోంది. గతంలో అభివృద్ధి అంటా ఒక ప్రాంతానికి పరిమితమయ్యేలా నిర్ణయాలు తీసుకున్నారనే భావన కూడా ఆయన మాటల్లో స్పష్టమైంది. అందువల్లనే ఆయన శాసనసభలో ప్రకటించిన విశాఖపట్టణంలో ఎక్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూల్ లో జ్యూడిషియల్ క్యాపిటల్ ప్రతిపాదనకు .. ఇప్పుడు ఈ వ్యాఖ్యలకు బలం చేకూర్చేవిధంగా ఉన్నాయి. రాష్ట్రంలో మూడు ప్రాంతాల ప్రజలు సమానంగా అన్నదమ్ముల్లా కలిసివుండే లాగా, అన్ని ప్రాంతాల ప్రజల మధ్య అనుబంధాలు పెంపొందించేలా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి పరోక్షంగా ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలను మరోసారి పునరుద్ఘాటించారని అనుకోవచ్చు.

ఈరోజు మధ్యాహ్నం 3:30 కి బీసీజీ కమిటీ తన తుది నివేదిక ను ముఖ్యమంత్రికి అందించనుండడం, 6 వ తేదీన హైపర్ కమిటీ సమావేశం, ఆ తరువాత 8 వ తేదీన జియన్ రావు, బోస్టన్ కన్సల్టెన్సీ ఇచ్చిన రెండు నివేదికలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్న తరుణంలోనే జగన్ ఉద్దేశాపూర్వకంగానే పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారని అర్ధం చేసుకోవచ్చు. ఇదే సమయంలో చంద్రబాబు హయాంలో రాజధాని పేరుతొ భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడం, ఇలా వరుసగా జరుగుతున్న పరిణామాలను బట్టి రాజధాని అంశం పై ముఖ్యమంత్రి అనుసరించనున్న వైఖరి ఏంటనేది స్పష్టమవుతోంది.