ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బతిన్న కాంగ్రెస్ ఈ ఏడాది చివరిలో జరగనున్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్ లో ఎలాగైనా విజయం సాధించాలని ప్రణాళికలు రచిస్తోంది. సుమారు రెండున్నర దశాబ్దాలుగా దూరమైన అధికారాన్ని చేజిక్కించుకోవాలని తపిస్తోంది. అయితే పార్టీ ముఖ్యనేతలను కాపాడుకోలేకపోవడం కాంగ్రెసుకు శాపంగా పరిణమించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే […]
రాబోయే కొద్దినెలల్లో గుజరాత్ అసెంబ్లీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అన్ని పార్టీలు గుజరాత్‌పై దృష్టిసారిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఐదురాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా పంజాబ్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న ఆమ్ఆద్మీ పార్టీ గుజరాత్‌పై దృష్టి కేంద్రీకరించింది.ఈ క్రమంలో గుజరాత్ యువనేత, ఆ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్‌ను తమ పార్టీలోకి ఆహ్వానించింది. ఇటీవలి కాలంలో హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారని, ఆయన త్వరలో పార్టీ మారుతున్నారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో […]
జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయ శక్తిపై నిత్యం చర్చ జరుగుతూనే ఉంటుంది. మూడో కూటమి ద్వారానో లేదా ఏదైనా పార్టీ ద్వారానో ప్రత్యామ్నాయ శక్తి రూపుదాల్చుతుందనే చర్చ సాగుతోంది. అయితే ఇవీన్న కేవలం చర్చలకే పరిమితం అయ్యాయి. ఇప్పుడు కూడా జాతీయ స్థాయిలో కూటమి కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కేసీఆర్, […]
జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోన్న ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత కేజ్రీవాల్ దూకుడు పెంచారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఎలాగైనా ఈ సారి మూడు కార్పొరేషన్ల (ఢిల్లీ నార్త్, ఈస్ట్, సౌత్)ను కైవసం చేసుకోవాలని వ్యూహాలకు పదును పెట్టారు. అయితే ఆప్ జోరును అంచనా వేసిన బీజేపీ.. తన అధికారాన్ని ఉపయోగించి ఎన్నికలు వాయిదా పడేలా చేసింది. మూడు కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతున్న తరుణంలో.. ఆయా కార్పొరేషన్లను విలీనం […]
ఈమధ్యే జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పంజాబ్ రాష్ట్రంలో దుమ్ము దులిపింది. సామాన్యుడి చీపురు అధికారంలో ఉన్న కాంగ్రెసుతో సహా అన్ని పార్టీలను ఊడ్చి పారేసింది. కాకలుతీరిన యోధులను మట్టి కరిపించి అధికారం చేజిక్కించుకుంది. ఢిల్లీ దాటి పంజాబులోనూ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అక్కడికి కొద్దిరోజుల వ్యవధిలో ఏపీలో జనసేన పార్టీ ఎనిమిదేళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకుని తొమ్మిదో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం […]
పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘన విజయం సాధించడం ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఎనలేని ఉత్సాహాన్ని ఇస్తోంది. భారీ విజయాన్ని కేజ్రీవాల్ ప్రజలతో కలిసి తనదైన శైలిలో పంచుకుంటున్నారు. ఆదివారం అమృత్‌సర్‌లో పంజాబ్‌కు కాబోయే ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే సూత్రాన్ని కేజ్రీవాల్ తు.చ తప్పకుండా ఆచరిస్తున్నారు. […]
దేశ రాజధాని ఢిల్లీకే పరిమితం అయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గురించి నిన్నటివరకు దేశంలోని ఇతర రాష్ట్రాలలోని పార్టీలు ఆలోచించలేదు. అయితే పంజాబ్‌లో ఆప్ సాధించిన విజయం తర్వాత.. ఆయా పార్టీలలో కలవరం మొదలైందా..? అనే సందేహాలు నెలకొన్నాయి. ఫలితాల తర్వాత ఆయా పార్టీలు గుమ్మనంగా ఉండడం ఈ సందేహాలకు బలం చేకూరుతోంది. సాధారణంగా ఏ పార్టీ అయినా ఏదైనా రాష్ట్రంలో విజయం సాధిస్తే.. ఇతర రాష్ట్రాలలోని అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు శుభాకాంక్షలు చెప్పడం […]
దేశ రాజధాని ఢిల్లీలో పురుడుపోసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇప్పుడు మరో రాష్ట్రంలో పాగా వేసింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో పంజాబ్‌లో ఆప్ తిరుగులేని విజయం సాధించింది. 117 స్థానాలకు గాను ఏకంగా 92 సీట్లు నెగ్గి అధికారం చేపట్టబోతోంది. ఈ పరిణామం తర్వాత ఆప్ తదుపరి ప్రయాణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఢిల్లీ, పంజాబ్.. తర్వాత ఏమిటినే చర్చ జరుగుతోంది. ఆప్ జాతీయ పార్టీగా రూపుదిద్దుకుంటుందా..? ఇతర రాష్ట్రాలలోనూ అధికారం సంపాదిస్తుందా..? అనే అంశాల […]
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. పంజాబ్ మినహా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాలను కైవసం చేసుకుంది. కమలం ధాటికి ప్రత్యర్థి పార్టీలు బేజారయ్యాయి. పంజాబ్‌లో ఆప్ దెబ్బకు కాంగ్రెస్, శిరోమణి అకాళిదల్ పార్టీలు మట్టికరిచాయి. అధికారంలో ఉన్న పంజాబ్‌ను చేజార్చుకున్న కాంగ్రెస్, ఆశలు పెట్టుకున్న ఉత్తరాఖండ్, గోవాల్లోనూ చతికిలపడింది. బీజేపీ జోరుకు కాంగ్రెస్ బేజారైంది. పంజాబ్ ఆప్ వశమైంది. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 403 […]
పేరు.. సామాన్యుడి పార్టీ. ఎన్నికల గుర్తు చీపురు. నాయకుడేమో ఎటువంటి రాజకీయ నేపథ్యంలేని మాజీ బ్యూరోక్రాట్. అదేం పార్టీ.. మూన్నాళ్లకే మాయంకావడం ఖాయమని పలువురు పలు రకాలుగా చర్చించుకున్నారు. తేలిగ్గా తీసిపారేశారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా, సంప్రదాయ రాజకీయాలకు చాలాదూరంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అనతికాలంలోనే తన ఉనికిని ఘనంగా చాటుకుంది. జాతీయ పార్టీలనే సవాల్ చేసి పదేళ్లుగా దేశ రాజధాని ఢిల్లీని ఏలుతోంది. సామాన్యులు, సంస్కరణలే లక్ష్యంగా ప్రజాబాహుళ్యంలోకి చొచ్చుకుపోతోంది. […]