iDreamPost
android-app
ios-app

పీఎం విచారణలో క్లీన్ చిట్, లాకర్‌లో సీబీఐ ఏం క‌నిపెట్ట‌లేద‌ని ఢిల్లీ డిప్యూటీ సీఎం కామెంట్

  • Published Aug 30, 2022 | 3:14 PM Updated Updated Aug 30, 2022 | 3:14 PM
పీఎం విచారణలో క్లీన్ చిట్, లాకర్‌లో సీబీఐ ఏం క‌నిపెట్ట‌లేద‌ని ఢిల్లీ డిప్యూటీ సీఎం కామెంట్

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు దాడుల్లో తన కుటుంబానికి క్లీన్ చిట్ లభించిందని, సిబిఐ అధికారులు తన ఇంట్లో, లాక‌ర్ లో ఏం కనుగొనలేదని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు. ఘజియాబాద్ బ్యాంక్‌లోని లాకర్‌ను సీబిఐ అధికారులు పరిశీలించిన త‌ర్వాత సిసోడియా మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు.

“లాకర్‌లో నా పిల్లలు, భార్యకు చెందిన సుమారు ₹ 70,000 విలువైన న‌గ‌లున్నాయి. పీఎం నా ఇంటిపై దాడి చేయడం, నా లాకర్‌ను సోదా చేయడం, ఏమీ కనిపించకపోవడంతో నేను హ్యాపీ. ప్రధానమంత్రి ఆదేశించిన అన్ని దాడుల్లో నా కుటుంబానికి, నాకు క్లీన్ చిట్ దొరికింది. ” అని ఆయన వ్యాఖ్యానించారు. దాడుల సమయంలో సీబీఐ అధికారులు నాతో మర్యాదగా ప్రవర్తించారని సిసోడియా మ‌రోసారి చెప్పారు “ఏమీ దొరకదని వారికి తెలుసు. నన్ను కొన్ని నెలలపాటు జైల్లో పెట్టడానికి ఏదో ఒకటి వెతకమని పీఎం ఒత్తిడి చేస్తున్నార‌న్న‌ది ఆయ‌న ఆరోప‌ణ‌.

సీబీఐ తనిఖీల వేళ‌ సోమవారమే, ట్వీట్ చేశారు సిసోడియా. ఆగస్టు 19న తన ఇంట్లో 14 గంటలపాటు తనిఖీలు నిర్వహించినా సీబీఐకి ఎలాంటి అధారాలు లభించలేదని అన్నారు. బ్యాంకు లాకర్లో వెతికినా ఏమీ దొరకదని ముందుగానే చెప్పాను. తన ఫ్యామిలీ అంతా అధికారులకు స‌హ‌క‌రిస్తామ‌ని అన్నారు.

ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీలో అవినీతి జరిగిందన్న‌ ఆరోపణలతో మనీశ్ సిసోడియా స‌హా మొత్తం 15 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది.

బీజేపీ అవినీతి ఆరోపణలను ఆప్ మొదటి నుంచి ఖండిస్తోంది. మా ప్ర‌భుత్వ మంచి పనులను చూసి ఓర్వేలేకే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది.