Arjun Suravaram
Chahat Pandey: ఎన్నికల్లో ఎంతో మంది ప్రముఖలకు ఓటర్లు షాకిచ్చిన ఘటనలు అనేకం జరిగాయి. అలానే ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఓ బ్యూటీకి ఓటర్లు ఊహించని షాకిచ్చారు. ఆదివారం విడుదలైన ఫలితాల్లో ఆమెకు ఊహించని గిఫ్ట్ ఇచ్చారు.
Chahat Pandey: ఎన్నికల్లో ఎంతో మంది ప్రముఖలకు ఓటర్లు షాకిచ్చిన ఘటనలు అనేకం జరిగాయి. అలానే ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఓ బ్యూటీకి ఓటర్లు ఊహించని షాకిచ్చారు. ఆదివారం విడుదలైన ఫలితాల్లో ఆమెకు ఊహించని గిఫ్ట్ ఇచ్చారు.
Arjun Suravaram
సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. అంతేకాక ఆదివారం నాలుగు రాష్ట్రాల ఫలితాలు కూడా వెలువడ్డాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. అలానే తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక ఈ ఎన్నికల్లో ఎన్ని చిత్రమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రముఖలతో పాటు అతి సామాన్యులు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. ఎంతో ఫేమస్ అయిన వాళ్లు కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు. అయితే వారికి ఓటర్లు ఊహించని షాక్ ఇచ్చారు. అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. పూర్త వివరాల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇక్కడ బీజేపీ మెజార్టీ సీట్లును సాధించింది. ఇదే ఎన్నికల్లో టీవీ యాక్టర్ చాహర్ పాండే కూడా పోటీ చేశారు. దామోహ్ జిల్లాలోని ఓ అసెంబ్లీ స్థానం నుంచి ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ తరపున నుంచి బరిలో దిగారు. ఆమె సోషల్ మీడియాలో 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంటే 12 లక్షల మంది ఆమెను ఫాలో అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె గెలిచే అవకాశాలు ఉన్నాయని అందరు భావించారు.
కానీ చాహత్ పాండేకు ఓటర్లు ఊహించని షాక్ ఇచ్చారు. ఆమె ఎన్నికల్లో ఓడిపోవడమే కాకుండా డిజిపాటి కూడా కోల్పోయారు. ఆమెకు కేవలం 2292 ఓట్లు మాత్రమే వచ్చాయి. చాహర్ పాండే మధ్యప్రదేశ్ లోని దామోహ్ అనే జిల్లాకు చెందినది. ఆమెకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరిక ఉంది. ఆ కారణంతో 2023 జూన్ లో ఆప్ పార్టీలో జాయిన్ అయ్యింది. అప్పటి నుంచి ఆమె జిల్లాలో ప్రచారం చేస్తోంది. అలానే ఈ శాసన సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అందంగా ఉన్నాని ఎలాగైన గెలుస్తాని ఆమె భావించిందని అయితే ఓటర్లు ఆమెకు షాకిచ్చేల తీర్పు ఇచ్చారని కొందరు అభిప్రాయ పడ్డారు.
ఇక ఆమె వ్యక్తి గత విషయానికి వస్తే.. చాహత్ పాండే 17 ఏళ్ల వయసులోనే బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. పవిత్ర బంధన్ అనే షోతో బుల్లితెర ప్రేక్షకులకు ఈమె పరిచయమైంది. అందం, అభినయంతో అందరిని ఆకట్టుకోవడమే కాకుండా అనేక అవకాశలు సంపాదించింది. తెనాలి రామకృష్ణ, రాధాకృష్ణ, స్వాధాన్, నాగిణీ-2,క్రైమ్ పెట్రోల్ వంటి షోలో యాక్ట్ చేసింది. ప్రస్తుతం పలు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
అలానే మన తెలంగాణలో బర్రెలక్క కూడా ఎన్నికలకు ముందు ఫుల్ ఫేమస్ అయ్యారు. అయితే ఆమె ఆశించిన స్థాయిలో ఓట్లు పడలేదు. అయితే ఆమె పోటీ చేయడమే సగం గెలుపు అంటూ పలువురు ప్రశంసులు కురిపించారు. మరి.. ఈ 1.2 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న ఈ బుల్లితెర బ్యూటీ అంత తక్కువ ఓట్లు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.