టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అశ్మిత్ రెడ్డిలకు ఉచ్చు బిగుస్తోందా..? ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా వాహనాలను విక్రయించిన కేసులో వారు పూర్తిగా ఇరుక్కుపోయారా..? రాజకీయ కక్షతోనే తమపై కేసులు పెట్టారని చేసిన విమర్శలు తేలిపోయాయా..? చంద్రబాబు అండ్‌కో చేసిన విమర్శలు అన్నీ రాజకీయ రాద్ధాంతమేనని తేలిపోయిందా..? అంటే తాజాగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు విన్నవారి నుంచి ఖచ్చితంగా అవుననే సమాధానం వస్తోంది. రాజకీయ కక్షతో తమపై వైసీపీ సర్కార్ […]
ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన రంగులను తొలగించాలని దేశ అత్యున్నత న్యాయ స్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసింది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రిం ఈ మేరకు పై విధంగా తీర్పు వెలువరించింది. ఈ విషయంలో హైకోర్టు తీర్పు స్పష్టంగా ఉందన్న సుప్రిం నాలుగు వారాల్లోగా రంగులు తొలగించాలని ఆదేశించింది. లేకుంటే కోర్టు ధిక్కారం కింద […]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత తనకు తానే ఎస్ఈసీగా ప్రకటించుకున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు నిన్న శనివారం రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఊహించని ట్విస్ట్ ఇవ్వడంతో తాజా పరిణామాలపై వేగంగా పావులుకదుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును గౌరవించడంలేదని, కోర్టు ధిక్కారానికి పాల్పడుతుందని రేపు సోమవారం హైకోర్టులో మళ్లీ పిటిషన్ దాఖలు చేసేందుకు రమేష్‌కుమార్ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తాజా పరిణామాలపై ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ రాష్ట్ర […]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) వ్యవహారంలో మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మళ్లీ హైకోర్టు తలుపుతట్టనున్నారు. ఎస్ఈసీ అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం గౌరవించడంలేదని.. ప్రభుత్వం కోర్టు ఉల్లంఘనకు పాల్పడిందనని కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం హైకోర్టు సమ్మర్ వెకేషన్ బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ నెల 29వ తేదీన హైకోర్టు తీర్పుననుసరించి నిమ్మగడ్డ తనకు తానే తిరిగి ఎస్ఈసీగా బాధ్యతలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి తనను కొనసాగించేలా హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా చార్జి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఎప్పటిలాగా తన బాధ్యతలు, విధులను నిష్పక్షపాతంగా, నిజాయతీతో నిర్వర్తిస్తానని తెలిపారు. ఈ మేరకు మీడియాకు నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ప్రకటన విడుదల చేశారు. స్థానిక ఎన్నికల ప్రక్రియపై త్వరలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తానని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తెలిపారు. పరిస్థితులు అనుకూలించాక స్థానిక ఎన్నికల ప్రక్రియను తిరిగి […]
మత్తు డాక్టర్ సుధాకర్ ఘటనపై రాష్ట్ర హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంపై చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ తనదైన శైలిలో స్పందించారు. సుధాకర్ ఘటన చిన్న పెట్టి కేసు అని వ్యాఖ్యానించారు. దీనిని సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించడంతో రాష్ట్రం యావత్తు విస్తుపోయిందన్నారు. కరోనా లేకపోతే ఈ విషయంపై తాను ఆందోళన చేసేవాడినని చెప్పారు. కోర్టు తీర్పులను ప్రశ్నించకూడదన్న నియమం ఉందని.. కానీ కోర్టు ఇలాంటి తీర్పులు ఇచ్చినప్పుడు న్యాయ స్థానాలపై నమ్మకం […]
నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ వివాదాన్ని సిబిఐతో విచారణ చేయించాలన్న హైకోర్టు ఆదేశాలను అధికార వైసిపి స్వాగతిస్తోంది. మామూలుగా ప్రతిపక్షాలు సిబిఐ విచారణ డిమాండ్ చేయటం, అధికారపార్టీ పట్టించుకోకపోవటం సహజంగా అందరు చూసేదే. కానీ ఇక్కడ రాజకీయపార్టీల ప్రమేయం లేకుండా హైకోర్టు వివాదాన్ని సిబిఐతో విచారణ చేయించాలని డిసైడ్ చేసింది. నిజానికి హైకోర్టు ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందని జనాలు ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే సిబిఐతో విచారణ చేయించేంత తీవ్రమైనది కాదు ఈ వివాదం. అయితే ఎప్పుడైతే హైకోర్టు సిబిఐ […]
రెండు కళ్లు, రెండు చిప్పలు, రెండు నాల్కల సిద్ధాంతంలో తనకు సాటి వచ్చే వారు మరొకరు లేరని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎప్పటికప్పుడు నిరూపించుకుంటుంటారు. దేశంలో సీనియర్ నేతను తానేనని చెప్పుకునే చంద్రబాబు… రెండు నాల్కల ధోరణిలో తనలా మరొకరు వ్యవహరించలేరని కూడా చాటిచెబుతున్నారు. పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు మారే చంద్రబాబు తన తీరును మత్తు డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో మరోసారి బయటపెట్టుకున్నారు. మత్తు డాక్టర్ సుధాకర్ ఘటనపై రాష్ట్ర హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడాన్ని తాను […]
లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన వైసీపీ ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించకూడదని ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన లాక్‌డౌన్‌ను ప్రజా ప్రతినిధులే ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి బాష్కర్ రెడ్డి, విడదల రజనీ, ఆర్కే రోజా, బియ్యపు మధుసూదన్ రెడ్డిలు తమ నియోజకవర్గ ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పై విధంగా […]
ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలకు వ్యతిరేకంగా పై హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. మాతృభూమి పౌండేషన్ ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. దుకాణాల వద్ద భౌతిక దూరం నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. మద్యం తాగడం తో రోగ నిరోధక శక్తి తగ్గుతుందని వివరించారు. మద్యపాన నిషేధానికి ఈ అవకాశాన్ని […]