Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలకు వ్యతిరేకంగా పై హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. మాతృభూమి పౌండేషన్ ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. దుకాణాల వద్ద భౌతిక దూరం నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. మద్యం తాగడం తో రోగ నిరోధక శక్తి తగ్గుతుందని వివరించారు. మద్యపాన నిషేధానికి ఈ అవకాశాన్ని ప్రభుత్వం ఉపయోగించుకోవాలని పిటిషనర్ తరఫు న్యాయవాది సూచించారు.
ప్రభుత్వం తరఫున న్యాయవాది.. మద్యపాన నిషేధం పై ప్రభుత్వ లక్ష్యాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. మద్యపాన నిషేధాన్ని వెంటనే అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పలేదని తెలిపారు. నాలుగేళ్లలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. గురువారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది