iDreamPost
android-app
ios-app

ఆంగ్ల మాధ్యమం ఉత్తర్వులను రద్దు చేసిన హైకోర్టు

ఆంగ్ల మాధ్యమం ఉత్తర్వులను రద్దు చేసిన హైకోర్టు

ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు రద్దు చేసింది. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలందరికీ ఆంగ్ల మాధ్యమంలో పాఠాలు బోధించాలని ఆంధ్రప్రదేశ్ సర్కారు నిర్ణయించింది. అనేక తర్జనభర్జనలు, సమాలోచనలు అనంతరం వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ముందుగా ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయానికి వచ్చింది. ఆ తర్వాత ప్రతి ఏడాది ఒక్క తరగతిని చేర్చేలా విధానాన్ని రూపొందించింది. ఇందుకు సంబంధించి జీవో నెంబర్ 81, 85 లను జారీ చేసింది.

ప్రభుత్వ నిర్ణయంపై బిజెపి నాయకుడు సుధీష్ రాంబోట్ల, కూచిపూడి శ్రీనివాస్ లు హైకోర్టును ఆశ్రయించారు. సదరు పిటిషన్లపై పలుమార్లు విచారణ చేపట్టిన హైకోర్టు తాజాగా ఈ రోజు తీర్పును వెల్లడించింది. ఏం మాధ్యమంలో విద్యను అభ్యసించాలనేది విద్యార్థులకు వదిలేయాలి అన్న పిటిషనర్ తరఫు న్యాయవాద వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 81, 85 లను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది వేచి చూడాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి