iDreamPost
android-app
ios-app

23 ఈసారి 3కు పడుతుంది.. మంత్రి అనిల్ ఆసక్తికర వ్యాఖ్య ..

23 ఈసారి 3కు పడుతుంది.. మంత్రి అనిల్ ఆసక్తికర వ్యాఖ్య ..

టిడిపి నేతలు అవాకులు చవాకులు పేలితే ప్రస్తుతమున్న 23 సీట్ల సంఖ్య ఈసారి మూడుకు పడిపోతాయని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జోస్యం చెప్పారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన అనిల్ కుమార్ యాదవ్..టిడిపి నేతలపై ఫైర్ అయ్యారు. కమ్మ వారితో పెట్టుకుంటే లేచి పోతారు అన్న రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యలపై మండిపడ్డారు. గత ఎన్నికల్లో ప్రజలతో పెట్టుకొని ఎవరు లేచిపోయారో అందరికీ తెలుసన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ,దళితుల పిల్లల అభ్యున్నతిని టీడీపీ అడ్డుకుంటూ..సీఎం జగన్మోహన్ రెడ్డిపై అవాకులు చెవాకులు పేలితే వచ్చే ఎన్నికల్లో రెండు మూడు సీట్లు కూడా రావని హెచ్చరించారు.

ఆంగ్ల మాధ్యమం పై హైకోర్టు తీర్పును టిడిపి రాజకీయానికి వాడుకుంటోందని అనిల్ కుమార్ విమర్శించారు. ప్రతి ఒక్కరికి మంచి విద్యను అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారని అనిల్ కుమార్ చెప్పారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోందని మంత్రి అనిల్ కుమార్ చెప్పారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు చేపడుతుందని తెలిపారు. ఈ సమయంలో అసత్యాలు ప్రచారం చేసి ప్రజలను అయోమయానికి గురి చేయవద్దని విన్నవించారు. పేద ప్రజలకు ఉచితంగా రేషన్, పప్పు, నగదు సహాయం అందిస్తున్నారని పేర్కొన్నారు. రెడ్ జోన్ ప్రాంతాలలో వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ రేషన్, పప్పు అందిస్తున్నామని మంత్రి తెలిపారు.