ఉపాధి కల్పనకు ఇదో కొత్తమార్గం – సీఎం యోగి యోచన యువతకు స్థానికంగానే చిన్నపాటి ఉపాధి చూపించి, వారి ఎదుగుదలకు బాటలు వేయాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఇంకో ముఖ్యమంత్రికి స్ఫూర్తిని ఇచ్చాయి. ఏపీ వేసిన మార్గంలో నడిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గ్రామ, వార్డు వలంటీర్లను లక్షల మందిని నియమించి, వారిద్వారా ప్రజలకు రేషన్, ఇంకా సంక్షేమ పథకాలు అందించడం ద్వారా అటు ప్రజలకు ఇటు వలంటీర్లకు ఏపీ ప్రభుత్వం బాసటగా నిలిచింది. […]
ఉత్తరప్రదేశ్ లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మే 3వ తేదీన లాక్ డౌన్ గడువు ముగిసినా.. జూన్ 30 వరకు ఆంక్షలు కొనసాగేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు ఒకే చోట ఎక్కువగా గుమికూడ కుండా ఉండాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ రూల్స్ ను బ్రేక్ చేసిన వారిపై […]
మహారాష్ట్ర పాల్ఘార్ జిల్లాలో 16 తేదీ రాత్రి దొంగలనే నెపంతో/భావించి మూక దాడికి పాల్పడిన ఘటనలో చిక్నే మహరాజ్ కల్పవృక్షగిరి, సుశీల్‌గిరి మహరాజ్ అనే సాధువులు, డ్రైవర్ నీలేశ్ తెల్గాడే మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 9 మంది మైనర్ల సహా మొత్తం 110 మందిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో 101 మందిని ఏప్రిల్ 30 వరకు పోలీస్ కస్టడీకి తరలించగా, మైనర్లను జ్యువైనల్ కారాగారానికి తరలించారు. అయితే తాజాగా కేంద్ర […]
కరోనా కనికరం చూపడం లేదు. రానురాను కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇది అనేక మందిని కలచివేస్తుంది. కొందరికి మాత్రం మరచిపోలేని చేదు జ్ఞాపకం అవుతోంది. ఇప్పటికే అనేక మంది సొంత వారిని కూడా చూసుకోలేని స్థితి ఏర్పడింది. అనేక చోట్ల అంతిమయాత్ర కూడా చేసుకోలేని, సొంత వారిని కడచూపు నకు నోచుకోని సమస్య తలెత్తింది. ఇప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితి ఏకంగా యూపి సీఎం కి ఎదురయ్యింది. కన్నతండ్రి చనిపోయినా వెళ్లలేని అగమ్య పరిస్థితి అయన ఎదుర్కొన్నారు. […]
కరోనా వైరస్ ప్రమాదకరంగా విస్తరిస్తున్నందున దేశం మొత్తం 21 రోజులు లాక్ డౌన్ విధిస్తూ ప్రధాని మోడీ ప్రకటన చేశారు. ప్రజలు గుంపులుగా బయట తిరగడం నిషేధించారు. ప్రయాణాలు పూర్తిగా స్తంభింప జేశారు. పవిత్రమైన పుణ్యక్షేత్రాలైన తిరుపతి,షిరిడి,భద్రాచలం లాంటి ఆలయాలు సైతం మూతపడ్డాయి. కానీ ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా రామ్‌లల్లా విగ్రహాన్ని రామ జన్మభూమి ప్రాంగణంలోకి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తరలించారు. రామ్ లల్లా విగ్రహాన్ని భక్తులు దగ్గరి నుంచి చూసి ఆశీర్వాదం పొందవచ్చని […]
క్లబ్బుపై దుండగుడి కాల్పులు.. పాఠశాల విద్యార్థులపై ఆగంతకుడి విచక్షణా రహిత కాల్పులు.. ఇలాంటి న్యూస్ అంతర్జాతీయ వార్తల్లో వింటూ ఉంటాం.. జీవితం మీద విరక్తి చెంది, మతి స్థిమితం కోల్పోయి శాడిజంతో ప్రజలపై దాడి చేస్తూ ప్రజలను అకారణంగా పొట్టన పెట్టుకుంటూ ఉంటారు కొందరు. విదేశాల్లో మాత్రమే కనిపించిన ఈ సంస్కృతి ఇప్పుడు జడలు విప్పి మన దేశంలో కూడా అడుగు పెట్టిందని ఉన్మాదిగా మారిన సుభాష్ బాథమ్ అనే వ్యక్తి చేసిన పని వల్ల అర్ధం […]