Dharani
Dharani
గత రెండు రోజులుగా తమిళ్ సోషల్ మీడియాలో తలైవా రజనీకాంత్ మీద ఓ రేంజ్‌లో ట్రోలింగ్ నడుస్తోంది. కారణం.. తమ అభిమాన హీరో అయినా రజనీకాంత్.. ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాళ్ల మీద పడటాన్ని ఫ్యాన్స్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ సాగుతోంది. వయసులో యోగి కంటే ఎంతో పెద్దవాడైన రజనీకాంత్ ఇలా చేయడం ఏంటని చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు అంతా కూడా నీకు మొక్కుతుంటే.. నువ్వెళ్లి యోగికి మొక్కుతావా.. మా ఆత్మాభిమానాన్ని దెబ్బ తీశావ్ అంటూ తమిళ అభిమానులు మండిపడుతున్నారు. ఇక తాజాగా ఈ వివాదంపై స్పందించారు రజనీకాంత్. ఎందుకు తాను యోగి ఆదిత్యనాథ్ కాళ్లకు నమస్కరించాడో చెప్పుకొచ్చాడు. ఆ వివరాలు..
తాజాగా రజనీ కాంత్.. నార్త్ పర్యటన ముగించుకుని.. చెన్నై చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ఈ వివాదం గురించి రజనీకాంత్‌ని ప్రశ్నించింది. తన మీద విమర్శులకు ధీటుగా బదులిచ్చాడు రజనీకాంత్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘వయసులో చిన్న వారు, పెద్ద వారు అని కాదు.. ఎదుటి వ్యక్తి ఓ మత గురువు, మఠాధిపతి, యోగి, స్వామిజీ అయితే నేను కాళ్లకు నమస్కరిస్తాను.. అది నా అలవాటు’’ అంటూ రజినీకాంత్ ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టేశాడు. మరి ఇప్పటికైనా రజనీ మీద ట్రోలింగ్ ఆగుతుందో లేదో చూడాలి.
జైలర్ విడుదల తర్వాత.. రజనీకాంత్ హిమాలయాలు, అటు నుంచి అటే మహావతార్ గుహకు వెళ్లాడు. ఆ తర్వాత.. అక్కడి నుంచి ఉ‍్తతరప్రదేశ్ వెళ్లి సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. ఈ సందర్భంగా రజనీకాంత్.. కిందకు వంగి.. యోగి కాళ్లకు మొక్కడం అందరికీ తెలిసిందే. దీనిపై గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఈ విషయంలో కొందరు రజనీని విమర్శిస్తే.. ఇంకొందరు మాత్రం సమర్థించారు.
యోగి సీఎం అని.. రజనీ ఆయన కాళ్లు మొక్కలేదు.. అతనొక మత గురువు, పీఠాధిపతి అందుకే ఆయన కాళ్లు మొక్కాడు అని ఓ వర్గం రజినీ చర్యను సమర్థిస్తూ వచ్చింది. కానీ తమిళ అభిమానులు మాత్రం రజినీని విమర్శిస్తూనే వచ్చారు. ఈ వివాదం సంగతి పక్కకు పెడితే.. రజినీకాంత్ జైలర్ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఇప్పటికే 500 కోట్ల రూపాయలు వసూలు చేసింది జైలర్. ఇంకా కలెక్షన్ల వర్షం కురుస్తూనే ఉంది.
Just IN: Superstar #Rajinikanth lands in Chennai with HUGE reception.
“Even if someone is younger than me, if they are a Yogi/Swamji , it is my practice to fall on their feet to seek blessing.
I want to thank people of TN and rest of the world for making #Jailer a huge… pic.twitter.com/ebcVb8Dc26
— Manobala Vijayabalan (@ManobalaV) August 21, 2023