iDreamPost
android-app
ios-app

చంపేస్తాం అంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి: రాజా సింగ్

  • Published Oct 26, 2023 | 11:39 AM Updated Updated Oct 26, 2023 | 11:39 AM

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల వారు ప్రచారాల్లో మునిగిపోయారు. కాకపోతే బీజేపీ మాత్రం రేపటి నుంచి ముమ్మర ప్రచారానికి సిద్దమైతుంది.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల వారు ప్రచారాల్లో మునిగిపోయారు. కాకపోతే బీజేపీ మాత్రం రేపటి నుంచి ముమ్మర ప్రచారానికి సిద్దమైతుంది.

  • Published Oct 26, 2023 | 11:39 AMUpdated Oct 26, 2023 | 11:39 AM
చంపేస్తాం అంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి:  రాజా సింగ్

తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్దం నడుస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రచారం చేస్తూ తాము చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక కాంగ్రెస్ తరుపు నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బస్సు యాత్ర మొదలు పెట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం బీజేపీ తరుపు నుంచి సూర్యాపేటలో జరిగే జనగర్జన సభలో అమిత్ షా సహా.. బీజేపీ ముఖ్యనేతలు పాల్గొంటారు. ఎన్నికల నేపథ్యంలో బీజీపీ అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. తెలంగాణలో బీజేపీ అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చేందుకు అన్నిరకాలుగా సిద్దం అవుతుంది. ఈ క్రమంలోనే బీజేపీ ఫైర్ బ్రాండ్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై ఉన్న సస్పెన్షన్ వేటును ఎత్తివేసింది. అంతేకాదు.. ఆయన సీటు ఆయనకే కేటాయించింది. తాజాగా రాజా సింగ్ తనకు ప్రాణహాని ఉందని సంచలన వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ప్రతిసారి ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టిస్తుంటారు. గత ఏడాది అధికార పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించిన నేపథ్యంలో రాజా సింగ్ తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న అదిష్టానం ఆయనపై సస్పెన్షన్ ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది. బీజేపీ కేంద్ర క్రమశిక్షణ సంఘం కార్యదర్శి అయిన ఓం పాఠక్ ఒక ప్రకటనలో తెలియజేశారు. తాను పద్నాలు నెలలు పార్టీకి దూరంగా ఉన్నానని.. వనవాసం చేసినంత పనైందని అన్నారు రాజాసింగ్. తనపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయడం, గోషామహాల్ ఎమ్మెల్యే సీటు తనకే ఇవ్వడం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడి పని చేస్తుంటే.. కొంతమంది తనను తన కుటుంబాన్ని దారుణంగా హత్య చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు బీజేఎల్పీనేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్.

ఈ సందర్బంగా బుధవారం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ.. ‘ఈ మద్య నాకు వరుసగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.. నన్ను నాతోపాటు నా కుటుంబ సభ్యులను కూడా చంపేస్తాం అంటున్నారు. అంతేకాదు గోషామహల్ నియోజకవర్గం నుంచి ప్రచారానికి వస్తున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ని కూడా చంపేస్తామని కాల్స్ వస్తున్నాయి. ఈ ఫోన్లు 15 డిజిట్ నంబర్ల నుంచి వస్తున్నాయి. ఈ విషయంపై పోలీస్ కమీషనర్ కి ఫిర్యాదు చేశాను. గతంలో కూడా నాకు ఎన్నో బెదిరింపు కాల్స్ వాచ్చాయి.. కానీ ఈసారి నన్ను, సీఎం యోగి ఆదిత్యనాథ్ ని దారుణంగా నరికి చంపేస్తాం అంటూ బెదిరిస్తున్నారు.. నాకు ప్రాణ హానీ ఉంది. ఈ బెదిరింపు ఫోన్ కాల్స్ పై పోలీసులు వెంటనే దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలాని’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.