Idream media
Idream media
ఉత్తరప్రదేశ్ లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మే 3వ తేదీన లాక్ డౌన్ గడువు ముగిసినా.. జూన్ 30 వరకు ఆంక్షలు కొనసాగేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు ఒకే చోట ఎక్కువగా గుమికూడ కుండా ఉండాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ రూల్స్ ను బ్రేక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఉత్తరప్రదేశ్ లో ఇప్పటివరకు 1604 కేసులు నమోదయ్యాయి. కరోనా వేగంగా విస్తరిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఉత్తరప్రదేశ్ కూడా ఒకటి. వైరస్ ను కంట్రోల్ చేసేందుకు ముఖ్యమంత్రి యోగి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వైద్యులు పై దాడి చేసిన వాళ్ళను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు తాజాగా ఒకే కుటుంభం లో ఏకంగా 18 మందికి వైరస్ సోకినట్లు తేలడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తోంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో రెండు జోన్లు ఏర్పాటు చేసి ప్రజలను బయటకు రానివ్వకుండా చర్యలు చేపట్టారు.
రేపు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరోనా నియంత్రణ , లాక్ డౌన్ అమలుపై చర్చించేందుకు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మే 3 న ముగిసే లాక్ డౌన్ పై కూడా ప్రధానంగా చర్చించనున్నారు. లాక్ డౌన్ కొనసాగాలా లేదా దశలవారీగా ఎత్తివేయాలని అనే అంశంపై ముఖ్యమంత్రి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఇప్పటికే లాక్ డౌన్ నుంచి పలు రంగాలకు మినహాయింపులు ఇవ్వడంతో దశల వారిగా ఎత్తివేత అనేది ఖాయంగా కనిపిస్తోంది. అయితే రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ పరిధిలోని రెడ్ జోన్లు, హాట్ స్పాట్ లో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేసే అవకాశం కనిపిస్తోంది.