Dharani
Dharani
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు మన దేశంలో మాత్రమే కాక విదేశాల్లో కూడా అభిమానులున్నారు. ఇక తమిళనాడులో ఆయితే ఆయన క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సూపర్ స్టార్ కోసం ఏకంగా ప్రాణం ఇచ్చే అభిమానులున్నారు తమిళనాడులో. ఇక రజనీకాంత్ సినిమా విడుదల అంటే.. ఏకంగా సెలవు ప్రకటిస్తారు అంటే.. తమిళనాడులో రజనీ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ.. కుర్ర హీరోలతో పోటీ పడుతున్నారు రజనీకాంత్. ఇక తాజాగా ఆయన నటించిన జైలర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం తమిళనాట మాత్రమే కాక.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తోంది. బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటారు రజనీకాంత్.
సినిమాల విషయం అలా ఉంచితే.. ప్రస్తుతం రజనీకాంత్.. ఉత్తర భారతదేశం యాత్రలో ఉన్నారు. ఈ క్రమంలోనే రజనీ కాంత్.. ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంటికి.. వెళ్లడం మాత్రమే కాక.. యూపీ సీఎం యోగి పాదాలకు నమస్కరించారు. ఇప్పుడు ఇదే తీవ్ర చర్చకు దారితీసింది. వయసులో తనకంటే చిన్నవాడైన సీఎం యోగి కాళ్లకు రజనీకాంత్ నమస్కరించడం ఏంటని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.
వయసు పరంగా చూసుకున్నా.. రజనీ వయసు 72 సంవత్సరాలు.. యోగి ఆదిత్య నాథ్ వయసు 51 సంవత్సరాలు. అలాంటిది తనకంటే 20 ఏళ్లు చిన్నవాడైనా యోగి కాళ్లకు రజనీకాంత్ నమస్కరించడం ఏంటని నెటిజనులు చర్చించుకుంటున్నారు. యోగి బీజేపీ నేత కావడం వల్లే రజనీకాంత్ ఇలా నమస్కారం చేశారని పలువురు నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు.
అయితే ఈ ప్రశ్నలకు తలైవా అభిమానులు సోషల్ మీడియా వేదికగా సమాధానాలు చెప్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ సన్యాసి అని.. అందుకే రజనీకాంత్.. యూపీ సీఎం కాళ్లకు దండం పెట్టారని చెబుతున్నారు. అంతేకాక యోగి గతంలో గోరక్‌పూర్ పీఠాధిపతి పదవిలో ఉండేవారు. అదే భక్తి భావనతో రజనీకాంత్.. సీఎం యోగి పాదాలకు నమస్కరించారని తలైవా అభిమానులు సమాధానాలు చెబుతున్నారు.
జైలర్ సినిమా రిలీజ్ తర్వాత రజనీకాంత్.. టోటల్‌గా ఆధ్యాత్మిక మూడ్‌లోకి వెళ్లారు. దీనిలో భాగంగానే ఆయన జార్ఖండ్ రాంచీలో ఉన్న తన గురువు పరమహంస యోగానంద ఆశ్రమానికి వెళ్లి అక్కడ గంటపాటు ధ్యానం చేశారు. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు రజనీకాంత్. ఇక నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్టర్‌గా రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల వసూళ్లు రాబట్టింది. సినిమా విడుదలైన రెండో వారం కూడా పలు రాష్ట్రాల్లోని థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి.