iDreamPost
android-app
ios-app

వీడియో: ఘోర ప్రమాదం.. 50 మంది ప్రయాణికులు ఉన్న ప్రైవేట్ బస్సు దగ్ధం!

  • Published Mar 11, 2024 | 5:28 PM Updated Updated Mar 11, 2024 | 5:28 PM

Bus Fire Accident: ఈ మధ్య కాలంలో ప్రమాదాలు ఏ రూపంలో ముంచుకు వస్తున్నాయో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. బస్సు పై విద్యుత్ తీగలు పడటంతో అగ్నికి ఆహుతి అయ్యింది.

Bus Fire Accident: ఈ మధ్య కాలంలో ప్రమాదాలు ఏ రూపంలో ముంచుకు వస్తున్నాయో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. బస్సు పై విద్యుత్ తీగలు పడటంతో అగ్నికి ఆహుతి అయ్యింది.

వీడియో: ఘోర ప్రమాదం.. 50 మంది ప్రయాణికులు ఉన్న ప్రైవేట్ బస్సు దగ్ధం!

మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. అనుకోకుండా జరిగే ప్రమాదాల వల్ల ఎంతోమంది మరణిస్తుంటారు. రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, కరెంట్ షాక్ ఇలా పలు కారణాల వల్ల ఎంతోమంది మృత్యుఒడిలోకి చేరుకుంటున్నారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది. ఎంతోమంది అనాథలుగా మిగులుతున్నారు. ఇటీవల దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య మరీ ఎక్కువ అవుతున్నాయి. అప్పుడప్పుడు ఎవరూ ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి.  అందరూ ఎంతో సంతోషంగా పెళ్లి కార్యక్రమానికి ప్రైవేట్ బస్సులో వెళ్తున్నారు. అంతలోనే బస్సు అగ్ని ప్రమాదానికి గురికావడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పలువురు మరణించగా.. చాలా మంది గాయపడ్డట్టు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. వీరంతా వివాహ కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఘాజీపూర్ జిల్లా బర్హి గ్రామ సమీపంలో లైవ్ విద్యుత్ తీగలు బస్సుకు తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు మృతుల సంఖ్య ఇంకా నిర్ధారించలేదు. ప్రస్తుతం ఐదుగురు మరణించినట్లు సమాచారం. బర్హి గ్రామంలోకి రాగానే బస్సు హై టెన్షన్ విద్యుత్ వైర్లు తాకడంతో ఈ ఘటన జగిఉంటుందని భావిస్తున్నారు.

ఇది గమనించిన స్థానికులు వెంటనే రంగంలోకి ప్రయాణికులను కాపాడే ప్రయత్నం చేశారు. మరికొంతమంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అప్పటికే బస్సులో నుంచి మంటలు, పొగలు దట్టంగా రావడంతో అటువైపు వెళ్లేందుకు ధైర్యం చేయలేకపోయారు. ఈ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం అందించాలని అధికారులను ఆదేశంచారు. బస్సు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.