iDreamPost
android-app
ios-app

ఉత్సవంలో బాణాసంచా పేలుడు.. నలుగురు విద్యార్థులు మృతి

  • Published Feb 15, 2024 | 11:54 AM Updated Updated Feb 15, 2024 | 11:54 AM

Firecracker Explosion: ఈ మద్య ఊరేగింపులు, ఉత్సవాల్లో బాణా సంచా పేలుస్తు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.. కానీ కొన్నిసార్లు అపశృతి చోటు చేసుకొని ప్రాణాలు సైతం పోతున్నాయి.

Firecracker Explosion: ఈ మద్య ఊరేగింపులు, ఉత్సవాల్లో బాణా సంచా పేలుస్తు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.. కానీ కొన్నిసార్లు అపశృతి చోటు చేసుకొని ప్రాణాలు సైతం పోతున్నాయి.

  • Published Feb 15, 2024 | 11:54 AMUpdated Feb 15, 2024 | 11:54 AM
ఉత్సవంలో బాణాసంచా పేలుడు.. నలుగురు విద్యార్థులు మృతి

మనిషి ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరూ ఊహించలేరు. అప్పటి వరుకు మనతో ఎంతో సంతోషంగా ఉన్నవాళ్లు హఠాత్తుగా కనిపించకుండా పోతారు. రోడ్డు ప్రమాదాలు, హార్ట్ ఎటాక్, ఆర్థిక కష్టాలు, అనారోగ్య సమస్యలు, అగ్ని ప్రమాదాలు, కరెంట్ షాక్ ఇలా ఎన్నో రకాలుగా చనిపోతున్నారు. కుటుంబాల్లో తీరని దుఖాఃన్ని మిగుల్చుతున్నారు. ఇటీవల ఊరేగింపులు, ఉత్సవాలు ఇతర కొన్ని సెలబ్రెషన్స్ కి బాణా సంచా కాల్చడం సర్వసాధారణం అయ్యింది. ఇది ఒక రకంగా సంతోషం అనిపించినా.. కొన్నిసార్లు తీవ్ర ప్రమాదాలకు దారి తీస్తుంది. ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఓ కాలేజ్ ఉత్సవంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లోని బుందేల్‌ఖండ్ గౌరవ్ మహోత్సవ్‌లో జరిగిన పేలుడులో నలుగురు విద్యార్ధులు చనిపోయారు. ఈ ఘటలో పలువురు గాయపడినట్లు పోలీసులు గురువారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం నాడు యూపీ టూరిజం శాఖ నిర్వహించిన చిత్రకూట్‌లోని బుందేల్‌ఖండ్ గౌరవ్ మహోత్సవ్‌లో బాణాసంచా కాల్చుతున్నారు. ఆ సమయంలో ప్రమాద వశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగి భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో నలుగురు విద్యార్థులు అక్కడిక్కడే మృతి చెందారు. బాంబు పేలుడు దాదాపు రెండు కిలో మీటర్ల వరకు వినిపించిందని, పేలుడు ధాటికి వేదిక వద్ద రెండు అడుగుల లోతు గుంత పడిందని చిత్రకూల్ ఎస్పీ అరుణ్ సింగ్ తెలిపారు.

ఉత్సవంలో జరిగిన ఈ ఘటనతో అందరూ భయబ్రాంతులకు గురయ్యారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి సమీక్షించారు. ఘటనా స్థలానికి  నాలుగు ఫైర్ ఇంజన్ వాహనాలు వచ్చి మంటలను అదుపు చేశాయి. క్షతగాత్రులను అంబులెన్స్ లో దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తర్వా మృతులను పరాస్ శర్మ, ఆజ్ఞేయ మిశ్ర, ప్రభాత్ పటేల్, మోహిత్ కుమార్ లు గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారిపై ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్లు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలిపారు. బుందేల్ ఖండ్ గౌరవ్ మహూత్సవ్ ఇక్కడ ఎంతో గొప్పగా నిర్వహిస్తారు. సాంస్కృతిక ఉత్సవాన్ని చిత్రకూట్ ఇంటర్ కాలేజ్ లో నిర్వహిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. చిత్రకూట్ లో జరిగిన ఈ ఘటనపై యూపీ సీఎం యోగి స్పందించారు. విద్యార్థుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా, గాయపడిన వారికి రూన.50లు ఎక్స్ గ్రేషియా తక్షణమే అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.