ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడుకు ఏ మాత్రం రుచించనట్లుగా ఆయన వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. మంత్రివర్గంపై యనమల చేసిన విమర్శలను చూస్తే.. ఆయన ఎంత కడుపు మంటతో రగిలిపోతున్నారో ఇట్టే అర్థమవుతుంది. జగన్ మంత్రివర్గం.. ఛాయ్, బిస్కెట్ కేబినెట్ అంటూ విమర్శలు చేశారు. యనమల ఈ తరహాలో వ్యాఖ్యలు చేయడం వెనుక కారణం ఆయన రాజకీయ ప్రత్యర్థికి మంత్రివర్గంలో చోటు లభించడమేనని అర్థమవుతోంది. యనమల సోదరుల రాజకీయ ప్రత్యర్థి […]
సీఎం జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర మంత్రివర్గం మొత్తం రాజీనామా చేసిన నేపథ్యంలో వైఎస్సార్ సీపీలో చీలిక వస్తుందని టీడీపీ ఆశలు పెట్టుకుంది. శాసనమండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతం ఇస్తున్నాయి. మంత్రి మండలిలో మార్పు ద్వారా రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం సృష్టించారని, జగన్ పదవీచ్యుతుడు కావడం ఖాయమని యనమల మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అయితే ముందుగా చెప్పినట్టుగానే మంత్రివర్గంలో మార్పులకు జగన్ శ్రీకారం చుట్టిన విషయం తెలియనట్టు యనమల రాజకీయ […]
కొంత మంది రాజకీయ నాయకులు, పార్టీలు.. చట్టాలు, రాజ్యాంగం ఇతరులకే గానీ తమకు వర్తించవన్నట్లుగా ప్రవర్తిస్తుంటాయి. అలాంటి వారిలో ముందు వరసలో ఉంటారు టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చట్టాలు, రాజ్యాంగం అమలు గురించి అసలు తెలియనట్లుగా వ్యవహరించే యనమల రామకృష్ణుడు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం రాజ్యాంగం, చట్టాలు ముందేసుకుని.. వీటిని ప్రభుత్వం పాటించడంలేదంటూ రోజుకో ప్రెస్ నోట్ విడుదల చేస్తుంటారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రస్తుతం వివాదం […]
గతం మరచిపోవడం లేదా గతాన్ని గుర్తుపెట్టుకోలేపోవడం సాధారణ ప్రజలకు ఎంతో నష్టం చేకూరుస్తుంది. అయితే కొంతమంది రాజకీయ నాయకులకు మాత్రం గతం గుర్తుపెట్టుకోలేపోవడం లేదా గుర్తులేనట్లుగా ప్రవర్తించడం వారికి వరం లాంటిది. గతం మరచిపోయినట్లుగా లేదా గుర్తులేనట్లుగా మాట్లాడడంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరి తేరారు. తమ పార్టీ ప్రభుత్వ పాలనలో తాము వ్యవహరించిన తీరు.. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలు మరచి.. ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. తాజాగా టీడీపీ […]
స్థానిక సంస్థల ఎన్నికలను ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వాయిదా వేసినప్పటి నుంచి సందర్భం వచ్చిన ప్రతిసారి ఇప్పటి వరకూ జరిగిన ప్రక్రియను రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలనే డిమాండ్ వినిపిస్తున్న టీడీపీ.. ఇప్పుడు స్వరం పెంచుతోంది. ఇటీవల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలోనూ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పిన టీడీపీ.. ఆ తర్వాత ఆ డిమాండ్‌ను బలంగా వినిపించే ప్రయత్నం చేస్తోంది. సమావేశానికి హాజరైన మెజారిటీ […]
ఏపీలో ‘లేఖ’ రేకెత్తించిన హీట్ అంతా ఇంతా కాదు. చరిత్రను తిరగేస్తే తప్ప ప్రస్తుత తరాలకు పెద్దగా ఇటువంటి సంఘటనలు గుర్తు కూడా లేదు. కానీ లేఖరాసినాయన, అందుకున్నాయన గమ్మున కూర్చున్నారు. కాకపోతే ప్రతిపక్షం హోదా నిలబెట్టుకోవడానికి నానా పాట్లు పడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ‘ఆఫ్ఘానిస్థాన్ బ్యాండు మేళం’ వాయించేస్తున్నారు. ఈ మేళానికి ముందు నుంచునే మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇంకో అడుగుకు ముందుకేసేసి జగన్ తరువాత సీయం ఎవరుంటారు? అని […]
గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అక్రమాలకు పాల్పడిన వ్యక్తుల అరెస్టులు ఆంధ్రప్రదేశ్ లో కొన సాగుతున్నాయి. ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు హస్తం ఉన్నట్లు ఆధారాలు దొరకడంతో.. ఆయనను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన జెసి ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి లు మరో కేసులో అరెస్ట్ అయ్యారు. పలు అక్రమాల భాగస్వామ్యంలో టీడీపీ హయాంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు ను కూడా త్వరలో అరెస్ట్ […]
మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప చిక్కుల్లో పడ్డారు. ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడికి రెండో వివాహం జరిపించిన నేరంలో వారిపై కేసు నమోదయ్యింది. యనమల స్వగ్రామంలో ఏర్పాటు చేసిన వివాహ కార్యక్రమాన్ని రెండు రోజుల క్రితం పోలీసులు అడ్డుకున్నారు. అప్పటికే తనను పెళ్లి చేసుకుని మోసం చేసి మరో పెళ్లికి చేసిన విషయంలో ఈ తతంగం నడిచింది. రెండో పెళ్లికి సిద్ధపడిన సదరు వరుడు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుమారుడు కావడం విశేషం. […]
టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ నేతలు మేథావిగా భావించే మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అచ్చెం నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలపై అరెస్ట్‌పై స్పందించారు. తన భాష ప్రావిణ్యాన్ని ఉపయోగించి ప్రాసలతో మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. వైసీపీ ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందని చెప్పుకొచ్చారు. అచ్చెం నాయుడు అరెస్ట్ ఒక తప్పు, జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ మరో తప్పు, జేసీ అస్మిత్ రెడ్డి అరెస్ట్ […]
గుమ్మడికాయల దొంగ ఎవరంటే.. భుజాలు తడుముకున్నట్లుగా ఉంది టీడీపీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడి వ్యవహారం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పేరుతో హల్చల్ చేసిన లేఖ నిన్న, ఈ రోజు మీడియాలో సృష్టించిన రాజకీయ దుమారం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆ లేఖ తాను రాయలేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఈ రోజు జాతీయ వార్త ఛానెల్ ఏఎన్ఐకి చెప్పారు. మరో వైపు ఈ విషయంపై సీరియస్‌గా దృష్టి […]