Idream media
Idream media
మండలి రద్దు తీర్మానం తర్వాత ప్రజాస్వామ్యం గురించి , ప్రజల సంక్షేమం గురించి మాట్లాడటం ప్రారంభించారు.
మాకు పదవుల కంటే ప్రజాస్వామ్యం ముఖ్యమని యనమల రామకృష్ణుడు అన్నాడు. ప్రజలు బ్రహ్మరథం పట్టి ఎన్టీఆర్‌ని ముఖ్యమంత్రిగా చేస్తే ఆయన్ని మోసం చేసి అధికారం లాక్కున్న చంద్రబాబుకి అన్ని విధాలా సహకరించిన యనమల కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ఎట్లా?
స్పీకర్‌గా అసెంబ్లీలో ఎన్టీఆర్ గొంతు నొక్కినప్పుడు , అది ప్రజాస్వామ్యం గొంతు నొక్కడం కాదా? ఎన్టీఆర్ పేరు చెప్పుకోకపోతే తమరు అసలు రాజకీయాల్లోకి వచ్చేవారా? చంద్రబాబుతో కలిసి ఈ రాష్ట్రం నెత్తిన లక్ష కోట్లు అప్పు పెట్టిన యనమల ప్రజల గురించి మాట్లాడుతున్నారు. ఆయన మంత్రిగా ఉండి, వియ్యంకుడు టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు అన్ని పదవులు మాకెందుకు? ప‌్రజలు చాలా మంది ఉన్నారు కదా అని అన్నారా?
బుద్దా వెంకన్న ఒక్క అడుగు ముందుకేసి పదవి తమకు వెంట్రుకతో సమానమని అన్నాడు. కౌన్సిల్ పెద్దల సభ అని, మేధావుల సభ అని, దానికో ఉదాత్తత ఉందని మీరే అంటున్నారు. మళ్లీ అదో వెంట్రుక అంటున్నారు. పెద్దరికం అంటే వెంట్రుకతో సమానమా? మేధావుల సభలో వెంకన్నని, లోకేశ్‌ని నామినేట్ చేసిన చంద్రబాబు సమాధానం చెప్పాలి.
అశోక్‌బాబు తాము దొడ్డిదారిన సభలోకి రాలేదని అన్నాడు. ఉద్యమాన్ని చంద్రబాబుకి అమ్మేయడాన్ని ఏ దారి అంటారో? ఒక రకంగా అశోక్‌బాబు లోకేశ్‌ని ఎద్దేవా చేస్తున్నాడు. లోకేశ్ దారి దొడ్డిదారే కదా!
వైసీపీ ఎమ్మెల్యేలను కొన్నప్పుడు , నంద్యాలలో ప్రలోభాలతో గెలిచినప్పుడు వీళ్లెవరికి ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదు.
రాజకీయ నాయకుల ప్రత్యేకత ఏమంటే ఎవరి ప్రజలు వాళ్లకు ఉంటారు.