గంగా నదిపై బోటులో ప్రయాణిస్తున్న కొందరు యువకులు హుక్కా తాగుతూ చికెన్ కాలుస్తున్న వీడియోపై సోషల్ మీడియా ఫైర్ అవుతోంది. యూపీలోని ప్రయాగ్ రాజ్ దగ్గర్లో ఉన్న నాగ వాసుకి గుడికి సమీపంలో ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతం హిందువులు అతి పవిత్రంగా భావించే తీర్థ స్థలం. వీడియోలో మొత్తం 8 మంది ఉన్నారు. వీళ్ళలో ఒకరు హుక్కా పైప్ స్మోక్ చేస్తుండగా ఇంకొకరు చికెన్ ని రోస్ట్ చేస్తున్నారు. అదే బోటులో ఉన్న […]
పబ్ కు ఎవరైనా ఎందుకు వెళ్తారు?? స్నేహితులతో ఛిల్ అవ్వడానికి. అయితే ఇక్కడే చాలామంది కాస్త హద్దులు దాటి శృతిమించిపోతున్నారు. కొందరు తప్పతాగి స్పృహ లేకుండా ప్రవర్తిస్తుంటే.. మరికొందరు మాత్రం విచిత్రంగా పబ్ సిబ్బందితోనే గొడవ పడుతున్నారు. తాజాగా ఇద్దరు యువతులు ఒక పబ్ సిబ్బందిపై దాడి చేయడం వైరల్ గా మారింది. ఉత్తర్ ప్రదేశ్ లోని లఖ్ నవూలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాగిన మత్తులో ఇద్దరు యువతులు పబ్బులో యువకుడిపై దాడికి […]
అసలు నలుగురైదుగురు ప్రయాణీకులను మాత్రమే ఎక్కించగలిగే సామర్థ్యం ఉన్న ఆటోలో, 27 మంది ప్యాసింజర్లను ఎక్కించుకోవడమంటే, ఆశ్చర్యంగా లేదూ? రోడ్డుమీద వేగంగా వెళ్తున్న ఆటోను పోలీసులు ఆపారు. అందర్నీ బైటకు దిగమన్నారు. 1…2…5…10…15 ఇంకా దిగుతూనే ఉన్నారు. పోలీసులు ప్రయాణికులను ఒక్కొక్కరుగా లెక్కిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో కనిపించింది. जनसंख्या विस्फोट का दुष्परिणाम ऑटो एक और सवारी सत्ताईस👇 pic.twitter.com/ex7QCiRJTp — Ashwini Upadhyay (@AshwiniUpadhyay) July […]
ఉత్తరప్రదేశ్ లో జరిగిన సామూహిక వివాహాల్లో 12 వేల జంటలు ఒక్కటయ్యాయి. యూపీలోని 60 జిల్లాల్లో జరిగిన ఈ పెళ్ళిళ్ల ద్వారా వేల జంటలు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాయి. కుల, మతాలకు అతీతంగా జరిగిన ఈ వివాహాల్లో ఒక్కో వధువు ఖాతాలో రూ.35 వేల చొప్పున జమచేసింది యూపీ ప్రభుత్వం. లక్నోలో జరిగిన ఈ వివాహ వేడుకలో రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అసిం అరుణ్ పాల్గొని.. నవ జంటలను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. […]
ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ వసతి గృహంలో (స్టేట్‌హౌం) ఆశ్రయం పొందుతున్న 57 మంది బాలికలు కరోనా బారిన పడటం.. వారిలో ఐదుగురు గర్భంతో ఉండటం.. ఒకరికి హెచ్‌ఐవి పాజిటివ్ ఉన్నట్టు తెలియడం కలకలం రేపుతున్నది. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల కాన్పూర్ జిల్లా వసతి గృహంలోని బాలికలకు కరోనా పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో 57 మంది బాలికలు కరోనా బారినపడ్డట్టు నిర్ధారణ అయింది. ఇదే సమయంలో వసతి గృహంలోని ఐదుగురు బాలికలు […]
ఉత్తరప్రదేశ్ శాసనసభకు 2022లో జరిగే జనరల్ ఎలక్షన్‌లలో తమ పార్టీ కాంగ్రెస్,బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి)లతో పొత్తు పెట్టుకోదని సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రకటించాడు. ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న వలస కార్మికులు తదుపరి ఎన్నికలలో కీలక పాత్ర పోషిస్తారని ఓ జాతీయ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిలేష్ పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా తమ పార్టీ చిన్న చిన్న […]
ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లాక్‌డౌన్ వల్ల ఉపాధి లేక రాజస్తాన్ నుంచి ఉత్తర ప్రదేశ్‌కు వలసకూలీలు నడకన బయలుదేరారు. మధ్యలో ఓ ట్రక్కు డ్రైవర్ వీరికి సహాయం చేశారు. వలసకూలీలు ప్రయాణిస్తున్న ట్రక్కు ఉత్తరప్రదేశ్ ఔరాయ జాతీయ రహదారిపై వేగంగా వెళుతు ఎదురుగా వస్తున్న మరో ట్రక్కును ఈ రోజు శనివారం తెల్లవారుజామున ఢీకొట్టింది. ఈ ఘటనలో 24 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మంది క్షతగాత్రులయ్యారు. వీరిని పోలీసులు […]
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు,ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ (80) బుధవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను లక్నో నగరంలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. ఆయన ఉదరకోశ సమస్య, మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని చికిత్స తర్వాత కోలుకున్నట్లు మేదాంత ఆసుపత్రి డైరెక్టరు,డాక్టర్ రాకేష్ కపూర్ తెలిపారు. అనారోగ్యముతో బాధపడుతున్న ములాయంకు అన్ని రకాల వైద్యపరీక్షలు చేశామని డాక్టర్ రాకేష్ కపూర్ చెప్పారు. ప్రస్తుతం ములాయం ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, […]
ఉపాధి కల్పనకు ఇదో కొత్తమార్గం – సీఎం యోగి యోచన యువతకు స్థానికంగానే చిన్నపాటి ఉపాధి చూపించి, వారి ఎదుగుదలకు బాటలు వేయాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఇంకో ముఖ్యమంత్రికి స్ఫూర్తిని ఇచ్చాయి. ఏపీ వేసిన మార్గంలో నడిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గ్రామ, వార్డు వలంటీర్లను లక్షల మందిని నియమించి, వారిద్వారా ప్రజలకు రేషన్, ఇంకా సంక్షేమ పథకాలు అందించడం ద్వారా అటు ప్రజలకు ఇటు వలంటీర్లకు ఏపీ ప్రభుత్వం బాసటగా నిలిచింది. […]
ఉత్తరప్రదేశ్ లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మే 3వ తేదీన లాక్ డౌన్ గడువు ముగిసినా.. జూన్ 30 వరకు ఆంక్షలు కొనసాగేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు ఒకే చోట ఎక్కువగా గుమికూడ కుండా ఉండాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ రూల్స్ ను బ్రేక్ చేసిన వారిపై […]