iDreamPost
android-app
ios-app

పండుగ ముందు మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత సిలిండర్..!

మహిళలకు శుభవార్త. ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ లబ్ధిదారులందరికీ ఉచితంగా ఎల్‌పిజి సిలిండర్లు అందించనుంది. ఇంతకు ఏ ప్రభుత్వం అంటే...?

మహిళలకు శుభవార్త. ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ లబ్ధిదారులందరికీ ఉచితంగా ఎల్‌పిజి సిలిండర్లు అందించనుంది. ఇంతకు ఏ ప్రభుత్వం అంటే...?

పండుగ ముందు మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత సిలిండర్..!

మహిళా సాధికారితే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. పలు పథకాలను తీసుకు వచ్చింది. వాటిల్లో ఒకటి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన. గృహ వాయు కాలుష్యం నుండి మహిళల్ని బయటపడేసేందుకు తెచ్చిందే ఈ పథకం. 2016 మే1న ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ స్కీం ప్రారంభమైంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు LPG కనెక్షన్‌లను అందించడమే ఈ స్కీమ్ ప్రథాన లక్ష్యం. ఇప్పటికే ఈ పథకం ద్వారా ఎంతో మంది మహిళలు తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్లను పొందారు. దీంతో మహిళలు బొగ్గు, కట్టెల కష్టాలకు గుడ్ బై చెప్పారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ అందించనున్నారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్.

దీపావళి పండుగకు ముందు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు పెద్ద బహుమతిని ఇవ్వబోతోంది. ఈ దీపాల పండుగను పురస్కరించుకుని గ్యాస్ లేని మహిళలకు శుభవార్త తెచ్చింది. ఈ పండుగను పురస్కరించుకుని ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ లబ్ధిదారులందరికీ ఉచితంగా LPG సిలిండర్లు అందజేస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన పోస్ట్ ద్వారా ప్రకటించారు. వీటిని అందించేందుకు దీపావళికి ముందే అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తద్వారా లబ్ధిదారులందరూ సకాలంలో ప్రయోజనం పొందవచ్చు. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన ప్రయోజనాలను పొందేందుకు అర్హతలు, ఇలా దరఖాస్తు చేసుకోండి.

మహిళ వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి.

మహిళకు ఇప్పటికే ఎలాంటి ఎల్‌పీజీ కనెక్షన్ ఉండకూడదు.

బీపీఎల్ కుటుంబానికి చెందిన మహిళే దీనికి అర్హులు

దరఖాస్తుకు అవసరమైన పత్రాలివే :

కుల ధృవీకరణ పత్రం
బీపీఎల్ రేషన్ కార్డు
ఆధార్ కార్డ్
మొబైల్ నంబర్
ఆదాయ ధృవీకరణ పత్రం
నివాస ధృవీకరణ పత్రం
పాస్‌పోర్ట్ సైజు ఫొటో

దరఖాస్తు చేసుకోండిలా

అధికారిక వెబ్‌సైట్ (www.pmuy.gov.in)కి వెళ్లండి.
మీరు హోమ్ పేజీలో డౌన్‌లోడ్ ఆప్షన్ ఎంచుకోవాలి.
అనేక లాంగ్వేజీ ఫారమ్‌లు ఉంటాయి. మీ లాంగ్వేజీని ఎంచుకోండి.
మీరు ఈ ఫారమ్‌ను ఎల్‌పీజీ సెంటర్ నుంచి కూడా పొందవచ్చు.
ఆ తర్వాత, ఫారమ్ ప్రింట్ తీసుకొని మొత్తం సమాచారాన్ని నింపండి.
మీరు ఫారమ్‌తో పాటు అవసరమైన పత్రాలను కూడా సమర్పించాలి.
మీరు సమీప ఎల్‌పీజీ సెంటర్‌లో ఫారమ్‌ను సమర్పించాలి.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత, మీకు ఉచిత గ్యాస్ కనెక్షన్ అందిస్తారు.
ఈ పథకం ద్వారా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకు గ్యాస్ కనెక్షన్‌తో పాటు ఉచితంగా సిలిండర్‌ను అందజేస్తున్నారు. అంతేకాదు.. సిలిండర్‌తో పాటు గ్యాస్ స్టవ్ కూడా ఉచితంగా పొందవచ్చు.