Keerthi
మంచి బ్యాంకు ఉద్యోగం.. పైగా డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రమోషన్, మంచి లగ్జరీ లైఫ్.. ఇలా అన్ని విధాలుగా వెల్ సెటిల్డ్ గా ఉన్న ఓ యువతి విషయంలో ఊహించని దారుణం చోటు చేసుకుంది.
మంచి బ్యాంకు ఉద్యోగం.. పైగా డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రమోషన్, మంచి లగ్జరీ లైఫ్.. ఇలా అన్ని విధాలుగా వెల్ సెటిల్డ్ గా ఉన్న ఓ యువతి విషయంలో ఊహించని దారుణం చోటు చేసుకుంది.
Keerthi
ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించడం యువతకు ఓ పెద్ద సవాలుగా మారింది. అలాంటిది సంపాదించిన ఉద్యోగం నిలబెట్టుకోవడం కోసం పెద్ద కసారత్తే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే.. చేతిలో ఉద్యోగం పోతే మళ్లీ కొత్త ఉద్యోగం సంపాదించుకోవడం కష్టమవుతుంది. కనుక ఎలాగైనా ఉన్న ఉద్యోగంలోనే కొనసాగాలని ప్రతిఒక్కరూ ఆలోచన చేస్తున్నారు. ఇలా ఆలోచించిన చాలామంది ఎంతో ఒత్తిడికి గురవుతున్నారు.
ముఖ్యంగా వ్యక్తిగత సమస్యలు, సమయానికి ఆహారం, నిద్ర తీసుకోలేకపోవడం, పోటీతత్వం, ఆదనపు బాధ్యతలు, గుర్తింపు నోచుకోకపోవడం, అధికారుల ఒత్తిడ ఇలా ఇన్ని రకాలుగా ఉద్యోగంలో ఒత్తిడికి గురైన వారు చాలామంది ఉన్నారు. అయితే ఈ అధిక పని ఒత్తిడి అనేది మనిషిని మానసికంగా కృంగదీసేలా చేస్తుంది. ఈ క్రమంలోనే. పని ఒత్తిడి తట్టుకోలేక చాలామంది ఆత్మహత్య చేసుకోవడం, హఠత్తుగా కుప్పకూలిపోవడం వంటి ఘటనలు ఇటీవల కాలంలో చాలానే జరుగుతున్నాయి. తాజాగా ఓ బ్యాంకు ఉద్యోగి కూడా ఇలానే విధుల్లో ఉండగా.. ఊహించని దారుణం చోటు చేసుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..
ఓ బ్యాంకు ఉద్యోగిని ఎప్పటిలానే తన విధుల్లో చేరి, పనిని నిర్వర్తిస్తుండగా.. ఒక్కసారిగా కుప్పకోలి ప్రాణాలు కోల్పోయింది. అయితే ఈ విషాద ఘటన యూపీలోని లక్నోలో చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనలో పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గోమతినగర్‌లోని ఓ ప్రైవేట్‌బ్యాంకులో అదనపు డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్‌గా.. సదాఫ్ ఫాతిమా అనే యువతి విధులు నిర్వహిస్తుంది. అయితే ఎప్పటిలానే ఆ యువతి మంగళవారం ఆఫీసుకు వచ్చారు. ఈ క్రమంలోనే విధులు నిర్వహిస్తుండగా ఉన్నట్టుండి కుర్చీలోనే ఒక్కసారిగా కుప్పలకూలిపోయింది. దీంతో వెంటనే గమనించిన తోటి ఉద్యోగులు ఆమెను స్థానికి ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే.. మృతురాలు ఫాతిమాకు ఇటీవలే డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు వచ్చిందని, అప్పటి నుంచే ఆమె తీవ్రమైన పని ఒత్తిడికి గురైందని ఆమె సహ ఉద్యోగులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. అధిక పని ఒత్తిడితో యువతి మరణించిన ఈ ఘటనపై తాజాగా సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ఖాతాలో.. ప్రైవేట్ , ప్రభుత్వ సంస్థలు ఎకానమీ టార్గెట్‌లను సీరియస్‌గా తీసుకుంటున్నాయని, అది ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తిడికి దారితీస్తుందని అన్నారు. అలాగే దీనికి అడ్డుకట్ట పడాలంటే.. పని ప్రదేశాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని ఆయన డిమాండ్ చేస్తూ రాసుకొచ్చారు. మరి, అధిక పని ఒత్తిడి కారణంగానే బ్యాంకు ఉద్యోగిని మరణించిదంటున్న ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
लखनऊ में काम के दबाव और तनाव के कारण एचडीएफ़सी की एक महिलाकर्मी की ऑफिस में ही, कुर्सी से गिरकर, मृत्यु का समाचार बेहद चिंतनीय है।
ऐसे समाचार देश में वर्तमान अर्थव्यवस्था के दबाव के प्रतीक हैं। इस संदर्भ में सभी कंपनियों और सरकारी विभागों तक को गंभीरता से सोचना होगा। ये देश के… pic.twitter.com/Xj49E01MSs
— Akhilesh Yadav (@yadavakhilesh) September 24, 2024