iDreamPost
android-app
ios-app

‘దృశ్యం’ సినిమా తరహాలో ప్రేయసిని హత్య.. జడ్జీ ఇంటి పక్కనే పాతిపెట్టి..

  • Published Oct 28, 2024 | 11:39 AM Updated Updated Oct 28, 2024 | 11:39 AM

Kanpur Crime News: ఈ మధ్య కాలంలో ప్రేమ, అక్రమసంబంధాల పేరిట ఎన్నో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. పరాయి వ్యక్తులపై వ్యామోహం పచ్చని కాపురాలు కూలిపోయేలా చేస్తుంది. ఓ మహిళ ప్రియుడితో పీకల్లోతు ప్రేమలో మునిగి చివరికి దారుణమైన పరిస్థితిని కొనితెచ్చుకుంది.

Kanpur Crime News: ఈ మధ్య కాలంలో ప్రేమ, అక్రమసంబంధాల పేరిట ఎన్నో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. పరాయి వ్యక్తులపై వ్యామోహం పచ్చని కాపురాలు కూలిపోయేలా చేస్తుంది. ఓ మహిళ ప్రియుడితో పీకల్లోతు ప్రేమలో మునిగి చివరికి దారుణమైన పరిస్థితిని కొనితెచ్చుకుంది.

  • Published Oct 28, 2024 | 11:39 AMUpdated Oct 28, 2024 | 11:39 AM
‘దృశ్యం’ సినిమా తరహాలో ప్రేయసిని హత్య.. జడ్జీ ఇంటి పక్కనే పాతిపెట్టి..

పెళ్లంటే నూరేళ్ళ పంట అంటారు పెద్దలు. కానీ ఈ మధ్య వివాహ బంధానికి విలువు లేకుండా చేస్తున్నారు కొంతమంది భార్యాభర్తలు. కట్టుకున్న వారికి పంచాల్సిన ప్రేమ మరొకరితో పంచుకుంటున్నారు. పచ్చని కాపురంలో చిచ్చుపెట్టుకుంటున్నారు. క్షణిక సుఖానికి బానిసై దంపతులు ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాల వల్ల సంతోషంగా ఉండాల్సిన కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. దృశ్యం సినిమా తరహాలో ఓ జిమ్ ట్రైనర్ తనతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న మహిళను చంపి ఏకంగా జిల్లా కోర్టు జడ్జీ ఇంటి ఆవరణలో పాతి పెట్టిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఏడాది జూన్ లో ఈ ఘటన జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

పోలీసుల కథనం ప్రకారం.. కాన్పూర్‌కు చెందిన చెందిన ఏకాగుప్త (32)అనే మహిళ ప్రతిరోజూ జిమ్ కి వెళ్తుండేది. ఈ క్రమంలోనే జిమ్ ట్రైనర్ విశాల్ సోనీతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త కొంత కాలం తర్వాత వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ తరుచూ బయట ఏకాంతంగా కలవడం జరుగుతూ వస్తుంది. భర్తకు తెలియకుండా ఇల్లీగల్ వ్యవహారం నడిపిస్తున్న ఏకాగుప్త తన భర్తను వదిలేసి ప్రియుడి విశాల్ ని పెళ్లి చేసుకుందామని భావించింది. అదే సమయంలో విశాల్ సోనీకి మరో యువతితో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం గురించి తెలుసుకున్న ఏకాగుప్త తన ప్రియుడు విశాల్ సోనీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిశ్చితార్థం జరగడంపై అభ్యంతరం చెప్పింది. నువు నాకే సొంతం.. వేరెవరికీ దక్కడానికి వీలు లేదని గొడవ పడింది. ఈ క్రమంలోనే జూన్ 24వ తేదీన జిమ్ కి వెళ్లిన ఏకాగుప్త తన ప్రియుడు విశాల్ తో కారులో బయటకెళ్లింది. అదే సమయంలో ఇద్దరి మధ్య నిశ్చితార్థం విషయంలో వాగ్వాదం జరిగింది. కోపంతో ఊగిపోయిన విశాల్ ఆమె మెడపై గట్టిగా గుద్దాడు. దాంతో ఏకాగుప్తా స్పృహ తప్పి పడిపోయింది.

తనతో ఎప్పటికైనా తనకు ప్రమాదం అని తెలుసుకున్న విశాల్.. ఏకాగుప్త ని చంపేశాడు. అచ్చం దృశ్యం సినిమా తరహాలో దగ్గరలో నిర్మాణంలో ఉన్న ఓ భవంతిలో పాతిపెట్టాడు. నిర్మాణంలో ఉన్న భవంతి కాన్పూర్ జిల్లా జడ్జీ అధికార నివాసం దగ్గరే ఉంది. జిమ్ కి వెళ్లిన తన భార్య తిరిగి ఇంటికి రాకపోవడంతో ఏకాగుప్త భర్త కాన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా విశాల్ పై అనుమానం వచ్చి తమదైన స్టైల్లో విచారణ చేశారు. విచారణలో తనే ఏకాగుప్తాని హత్య చేశానని ఒప్పుకున్నాడు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు మృతురాలు ఆమె మృతదేహాన్ని జడ్జీ అధికార నివాసం దగ్గర పోలీసులు వెలికి తీశారు. ట్విస్ట్ ఏంటంటే.. నిందితుడితో ఏకాగుప్తా కు వివాహేతర సంబంధం ఉందన్న విషయాన్ని ఆమె భర్త రాహూల్ గుప్తా నిరాకరించారు.తన భార్యను డబ్బు కోసం కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటాడని అంటున్నాడు. ఏది ఏమైనా దృశ్యం సినిమా తరహాలో జరిగిన ఈ హత్యా ఉదంతం కాన్పూర్ లో తీవ్ర సంచలనం సృష్టించింది.

jojobetjojobet girişjojobetjojobet girişjojobetjojobet girişjojobet güncel giriş