iDreamPost
android-app
ios-app

మోడల్ మాత్రమే కాదు చదువుల తల్లి.. అందమైన IPS ఆఫీసర్

  • Published Sep 11, 2024 | 3:13 PM Updated Updated Sep 11, 2024 | 3:13 PM

Aashna Chaudhary IPS Officer Success Story: దేశంలో లక్షలాది మంది యువత సివిల్ సర్వెంట్‌లుగా మారి దేశానికి తమవంతు సేవ చేయాలని కలలు కంటున్నారు. అయితే, ఈ లక్ష్యాన్ని సాధించే ప్రయాణం అంత సులభం కాదు. సివిల్స్ లో ర్యాంక్ కొట్టాలంటే కృషి, అంకితభావం అవసరం అంటారు.

Aashna Chaudhary IPS Officer Success Story: దేశంలో లక్షలాది మంది యువత సివిల్ సర్వెంట్‌లుగా మారి దేశానికి తమవంతు సేవ చేయాలని కలలు కంటున్నారు. అయితే, ఈ లక్ష్యాన్ని సాధించే ప్రయాణం అంత సులభం కాదు. సివిల్స్ లో ర్యాంక్ కొట్టాలంటే కృషి, అంకితభావం అవసరం అంటారు.

మోడల్ మాత్రమే కాదు చదువుల తల్లి.. అందమైన IPS ఆఫీసర్

నేటి సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండాలంటే గొప్ప చదువు ఉండాలని అంటారు. అందుకు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివిస్తున్నారు. చాలా మంది విద్యార్థులు పెద్దయ్యాక ఐఏఎస్, ఐపీఎస్ అవుతామని అంటారు. అయితే సివిల్స్ లో ర్యాంక్ సాధించాలంటే అంత ఆశామాశీ వ్యవహారం కాదు. అందుకే ఇంటర్ నుంచి ఆ ప్రయత్నాలు మొదలు పెడుతుంటారు. ఇటీవల దేశంలో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు సెలబ్రెటీలుగా మారుతున్న విషయం తెలిసిందే. అందంతో పాటు తమ తెలివి తేటలతో చదువుల్లో రాణిస్తూ మరోవైను సోషల్ మీడియాలో అప్ డేట్ అవుతూ పాపులారిటీ పెంచుకుంటున్నారు. అలాంటి వారిలో ఐపీఎస్ అధికారి అష్నా చౌదరి ఒకరు. వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలోని పిల్ఖువా అనే పట్టణానికి చెందిన ఆష్నా చౌదరి ఒక ఐపీఎస్ అధికారి. ఆమె 2022లో యూపీఎస్‌సి పరీక్షలో 116వ ర్యాంక్‌తో పాస్ అయ్యింది.సివిల్స్ లో ర్యాంక్ సాధించేందుకు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. వరుసగా రెండుసార్లు విఫలమైనప్పటికీ మూడో ప్రయత్నంలో ఈ విజయాన్ని సాధించింది.ఆమె తండ్రి డాక్టర్ అజిత్ చౌదరి ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ . తల్లి ఇందు సింగ్ గృహిణి. చిన్నప్పటి నుంచి ఆష్నా చదువు పట్ల ఎంతో చురుకుగా ఉండేది.. అలాగే సామాజిక సేవ పట్ల ఆసక్తి కనబరుస్తూ వచ్చేంది. ఆష్నా కుటుంబంలో చాలా వరకు ప్రొఫెసర్లే ఉన్నారు.. ఈ క్రమంలోనే పీహెచ్‌డీ చేస్తుందని భావించారు. కానీ వారి ఆలోచనలకు భిన్నంగా ఆష్ణా ఐపీఎస్ ఆఫీసర్ అయ్యింది.

పిల్ఖువాలోని సెయింట్ జేవియర్స్ స్కూల్, ఉదయపూర్‌లోని సెయింట్ మేరీస్ స్కూల్, ఘజియాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌తో సహా దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో ఎడ్యూకేషన్ పూర్తి చేసింది ఆష్నా. మొదటి నుంచి చదువులో మంచి ప్రతిభ కనబరుస్తూ.. ఇంటర్‌లో హ్యుమానిటీస్ స్ట్రీమ్‌లో 96.5 శాతం మార్కులు సాధించి అందరినీ అబ్బురపరిచింది. దేశంలో ఎంతో ప్రతిష్టాత్మక కళాశాలలలో ఒకటైన ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి ఇంగ్లీష్ లిటరేచర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. 2022 లో సివిల్స్ ఫలితాల్లో 116 ర్యాంక్ సాధించి ఐపీఎస్ గా ఎంపికయ్యింది. సివిల్స్ లో ర్యాంక్ సాధించడం కొసం ఆమె దాదాపు పది గంటలు చదువుపై దృష్టి సారించినట్లు ఆమె తండ్రి తెలిపారు. ఆష్నా చదువుల తల్లిగానే కాదు..వెనుకబడిన పిల్లలకు విద్యనందించడంలో ఒక ఎన్‌జీవోతో కలిసి పనిచేసింది.

ఓ వైపు చదువుల్లో రాణిస్తూనే డిగ్రీ నుంచే కొత్త ఫ్యాషన్స్, టూర్ల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేది. ఆమె అందానికి ముగ్దులైన కొన్ని సంస్థలు మోడలింగ్ అవకాశం ఇచ్చారు. కొంతకాలం మోడలింగ్ లో రాణించింది ఆష్నా. చదువుతో పాటు మోడల్ సత్తా చాటారు. ఒకప్పడు అందమైన మోడల్.. ఇప్పుడు ఐపీఎస్ అధికారి గా ప్రజలకు సేవ చేస్తుంది. అధికారిగా తన బాధ్యతలు నిర్వహిస్తూ పేద విద్యార్థుల చదువు కోసం కృషి చేస్తుంది. ఆమె జీవితం ఎంతో మందికి స్పూర్తిదాయకం అంటారు.