iDreamPost
android-app
ios-app

ఘోరం.. స్కూల్‌కు పేరు ప్రఖ్యాతలు రావాలని స్టూడెంట్ నరబలి..!

విద్యా సంస్థలు అంటే... విద్యార్థులకు మంచి నేర్పించి, జీవితానికి అవసరమైన పాఠాలు నేర్పించేవి. కానీ ఓ పాఠశాల తమ విద్యా సంస్థకు పేరు ప్రఖ్యాతలు రావడం కోసం అంధ విశ్వాసంలో కూరుకుపోయి..

విద్యా సంస్థలు అంటే... విద్యార్థులకు మంచి నేర్పించి, జీవితానికి అవసరమైన పాఠాలు నేర్పించేవి. కానీ ఓ పాఠశాల తమ విద్యా సంస్థకు పేరు ప్రఖ్యాతలు రావడం కోసం అంధ విశ్వాసంలో కూరుకుపోయి..

ఘోరం.. స్కూల్‌కు పేరు ప్రఖ్యాతలు రావాలని స్టూడెంట్ నరబలి..!

శాస్త్ర, సాంకేతికంగా ఇండియా అభివృద్ధి చెందుతోంది. అగ్ర రాజ్యాలతో పోటీ పడుతుంది. డెవలపింగ్ కంట్రీ నుండి డెవలప్డ్ కంట్రీ దిశగా అడుగులు వేస్తోంది. భూమి, గగన తలంపై ఎన్నో ప్రయోగాలు, పరిశోధనలు చేస్తుంది. చంద్రయాన్, సూర్యయాన్ అంటూ పాశ్చాత్య దేశాలు సైతం నివ్వెర పోయేలా చేస్తుంది. కానీ మూఢత్వం, అంధ విశ్వాసాల నుండి బయటపడలేకపోతుంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అపనమ్మకాలను బలంగా వేళ్లూనుకుపోయాయి. అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్ముతూ అంధకారంలో కూరుకుపోతున్నారు కొందరు. చేతబడులు, నర బలులు, తాంత్రిక పూజలు వంటివి గుడ్డిగా విశ్వసిస్తున్నారు. ఇలాంటి గుడ్డి విశ్వాసాల నుండి అవగాహన కల్పించాల్సి విద్యార్థులను ఉన్నత మార్గాల వైపు నడిపించాల్సిన విద్యా సంస్థలు, ఉపాధ్యాయులు.. ఇటువంటి చర్యలకు పాల్పడితే.. దేశం ఎటుపోతుందోనన్న సందేహం కలుగకమానదు.

స్కూల్ అభివృద్ధి చెంది, పేరు ప్రఖ్యాతలు రావాలని భావించిన ఓ ప్రైవేట్ విద్యా సంస్థ.. అత్యంత దారుణానికి పాల్పడింది. అభం, శుభం తెలియని 2వ తరగతి చదువుతున్న విద్యార్థిని బలి తీసుకుంది. ఈ విస్తుపోయే ఘటన ఉత్తరప్రదేశ్‪లోని హత్రాస్‌లో చోటుచేసుకుంది. రస్గవాన్ ప్రాంతంలోని డీఎల్ పబ్లిక్ స్కూల్‌లో కృతార్థ్ అనే 9 ఏళ్ల విద్యార్థి రెండవ తరగతి చదువుతున్నాడు. అక్కడే హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు పేరెంట్స్. అయితే ఓ రోజు హాస్టల్ నుండి స్టూడెంట్ తండ్రి కృష్ణన్‌కి ఫోన్ వచ్చింది. మీ అబ్బాయికి ఆరోగ్యం బాగోలేదు అంటూ సమాచారం అందించారు. హుటాహుటిన తండ్రి స్కూల్ వద్దకు చేరుకున్నాడు. తన కొడుకు ఎక్కడ అని ప్రశ్నించగా.. స్కూల్ డైరెక్టర్ దినేష్ బాఘెల్, అతని తండ్రి జశోధన్ సింగ్ ఆసుపత్రికి తీసుకెళ్లారంటూ చెప్పాడు. దీంతో అయోమయ పరిస్థితిలో అక్కడే ఉండిపోయాడు కృష్ణన్.

కాసేపటికి మీ కొడుకు చనిపోయాడంటూ సమాచారం అందించింది స్కూల్ యాజమాన్యం. కారులో స్కూల్ వద్దకు కొడుకు మృతదేహాన్ని తీసుకురాగా,  కన్నీటి పర్యంతమైన తండ్రి కృష్ణన్. అతడి మృతిపై అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేసిన పోలీసులు.. స్కూల్ డైరెక్టర్ దినేష్ బాఘెల్, అతడి తండ్రి జశోధన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇద్దరు పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతో బాలుడిది సాధారణ మరణం కాదని, హత్య అని నిర్ధారణకు వచ్చారు. ఇద్దర్నీ తమదైన స్టైల్లో విచారించే సరికి అసలు గుట్టు విప్పారు. స్కూల్‌కు పేరు ప్రఖ్యాతలు వచ్చేయాలని, టాప్ ర్యాంక్ రావాలన్న ఉద్దేశంతోనే ఆ విద్యార్థిని బలి ఇచ్చేందుకు హాస్టల్ నుండి బయటకు తీసుకు వెళుతుండగా.. ఏడ్వడటంతో తామే చంపేశామని నేరం అంగీకరించారు.

ఈ హత్యలో మరో ముగ్గురు ప్రమేయం కూడా ఉన్నట్లు తేలింది. ఆ ముగ్గురు కూడా ఉపాధ్యాయులే కావడం గమనార్హం. లక్ష్మణ్ సింగ్, వీర్‌పాల్ సింగ్, రాంప్రకాష్ సోలంకీలు హత్యలో పాల్గొన్నారని నిందితులు వెల్లడించారు. నిందితుల్ని అరెస్టు చేసి దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు. మూఢ నమ్మకాలు చెరిపి, విద్యార్థులను ఉన్నత స్థానాల వైపు తీర్చిదిద్దాల్సిన విద్యా సంస్థలు, ఉపాధ్యాయులు..  విద్యార్థులను బలి తీసుకున్న ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.