iDreamPost
android-app
ios-app

వృద్ధులను బురిడీ కొట్టించిన దంపతులు.. యవ్వనస్తులుగా మార్చే మిషన్ ఉందంటూ

టైం మిషన్‌లో కాస్తంత వెనక్కు వెళ్లిపోతే.. అబ్బా ఆ ఊహా ఎంత బాగుంటుందో కదా. ఇదిగో ఇదే ఆశను పెట్టుబడిగా మార్చుకున్నారు దంపతులు. భారీగా మోసాలకు పాల్పడ్డారు.

టైం మిషన్‌లో కాస్తంత వెనక్కు వెళ్లిపోతే.. అబ్బా ఆ ఊహా ఎంత బాగుంటుందో కదా. ఇదిగో ఇదే ఆశను పెట్టుబడిగా మార్చుకున్నారు దంపతులు. భారీగా మోసాలకు పాల్పడ్డారు.

వృద్ధులను బురిడీ కొట్టించిన దంపతులు.. యవ్వనస్తులుగా మార్చే మిషన్ ఉందంటూ

మీరు వృద్ధాప్యంలో ఉన్నారా.. అయితే మిమ్మల్ని యవ్వనస్థులుగా మార్చే అద్భుతమైన టైమిషన్ మా దగ్గర ఉంది. మిమ్మల్ని మునుపుటిలా నవ యవ్వనంతో మెరిసిపోయేలా చేసే బాధ్యత మాది. యూత్‌లా ఎగరొచ్చు.. దూకొచ్చు.. మీకెందుకు మాపై నమ్మకం ఉంచండి అంటూ వృద్దులను బురిడి కొట్టించారు దంపతులు. వీరి మాయ మాటలకు పడిపోయిన డజన్ల కొద్దీ ఓల్ట్ మ్యాన్స్ అండ్ ఉమెన్స్.. ఆ దంపతులు అడిగినదంతా ముట్టచెప్పారు. అలా డజన్ల కొద్దీ వృద్ధుల నుండి దొరికినంత దండుకున్నారు. కానీ మోసాలు ఎల్లకాలం సాగవు కదా.. ఓ బాధితురాలి ఫిర్యాదుతో ఈ స్కాం వెలుగు చూసింది. దీంతో ఒక్కక్కరిగా బయటకు వచ్చారు.  వీరి చెప్పిన కథలకు కన్విన్స్ అయిపోయిన వృద్ధులు.. కోట్ల రూపాయలను కేటుగాళ్లకు సమర్పించుకున్నారు. ఈ భారీ మోసం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది.

యవవ్వనస్తులను చేస్తాం అంటూ వృద్ధుల నుండి 35 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన దంపతులు.. ఆ డబ్బులతో విదేశాలు చెక్కేశారు. వివరాల్లోకి వెళితే కాన్సూర్‌లో నివస్తున్నారు రాజీవ్ కుమార్ దూబే అతని భార్య రష్మీ. ఈ కపుల్స్ కిద్వాయ్ నగర్‌లో థెరపీ సెంటర్‌ను నడుపుతున్నారు. వీరి దగ్గరకు చాలా మంది కస్టమర్లు వచ్చేవారు. వీరిలో వృద్ధులను టార్గెట్ చేశారు. ‘మా దగ్గర వృద్దులను నవ యవ్వనంగా నడిపించే మిషన్ ఉంది. అది ఇజ్రాయెల్ నుండి తెప్పించాం. ఆ టైమ్ మిషన్ ద్వారా మునుపుటిలా యూత్‌గా మారిపోవచ్చు. 60 ఏళ్ల వ్యక్తిని 25లా మార్చేస్తాం’ అంటూ మాయ మాటలు చెప్పారు. కాలుష్య స్థాయిల వల్లే వృద్ధాప్యం వస్తుందని, ఆక్సిజన్ థెరపీ చేస్తే నెల రోజుల్లోనే వృద్ధాప్య ఛాయలు ఎగిరిపోతాయంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పారు. దీనికి ఖర్చు అవుతుందని చెప్పారు. మొత్తం 10 సెషన్స్ ఉంటాయని, సెషన్‌కు రూ. 6 వేలు ఖర్చు అవుతుందని వృద్ధులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు.

మూడు సంవత్సరాల ప్యాకేజీ కేవలం రూ. 90 వేలు మాత్రమే అంటూ ఆశ జూపారు. దీంతో నిజమేనని నమ్మిన వృద్ధులు డబ్బులు కట్టారు. అయితే మోసం ఎన్నాళ్లు దాగుతుంది.. ఏదో ఒక రోజు బయట పడక తప్పదు కదా. అలా రేణు సింగ్ అనే బాధితురాలి రూపంలో బయటపడింది. తాను రూ. 10.75 లక్షలు మోసం చేశారని ఆరోపిస్తూ రేణు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో దంపతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే బాధితులు ఒక్కొక్కరుగా బయటకు రావడంతో ఇది భారీ మోసమని తేలింది. సుమారు 35 కోట్ల మేర దండుకుని ఉడాయించారు దంపతులు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే ఈ మోసం ఎప్పటికైనా బయట పడొచ్చునని గ్రహించిన ఈ మేడ్ ఫర్ ఈచ్ అదర్.. ఎప్పుడో పెట్టా బేడా సర్దుకుని విదేశాలకు చెక్కేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తానికి యూత్ అయిపోవాలన్న అత్యాశతో వృద్దులు బోల్తా పడిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.