గుజరాత్లోని అహ్మదాబాద్లో ఓ మహిళా ప్రిన్సిపాల్తో విద్యార్థిని కాళ్లకు దణ్ణం పెట్టించారు విద్యార్థి సంఘం నాయకులు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ పని చేయించిన ఆర్ఎస్ఎస్ విద్యార్థి సంఘం తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఓ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న విద్యార్థిని హాజరు తక్కువగా ఉంది. దీంతో గురువారం ( మే 12,2022) ఆర్ఎస్ఎస్ కు చెందిన ఏబీవీపీ నేత అక్షత్ జైస్వాల్, ఆ విద్యార్థినితోపాటు మరి కొందరిని తీసుకుని ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ […]
చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలో కంచి కామకోటి పీఠం ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓ సాంప్రదాయ పాఠశాల మరియు హాస్టల్ నుంచి నలుగురు విద్యార్థులు అర్ధరాత్రి హాస్టల్ గోడ దూకి పారిపోవడం కలకలం సృష్టించింది. చంద్రగిరిలోని శ్రీనివాస డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదివే నలుగు విద్యార్థినులు కాలేజీలో చదువుకొని, ఇక్కడ హాస్టల్ లో ఉంటున్నారు. అయితే సోమవారం రాత్రి ఆ నలుగురు గోడ దూకి పారిపోయారు. పోలీసుల కథనం ప్రకారం విజయనగరం, విజయవాడ, కడప, విశాఖపట్నం […]
కరోనా వైరస్ బారిన పడిన ప్రజలను కాపాడడంలోనూ, వారికి వైద్య పరంగా అండగా ఉండడంలోనూ దేశానికే ఆదర్శంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కరోనా బారిన పడిన వివిధ రంగాలను అదే స్థాయిలో ఆదుకుంది. ఈ క్రమంలో విద్యార్థులు కూడా కరోనా వైరస్ వల్ల నష్టపోకుండా చర్యలు చేపట్టింది. కరోనా వైరస్ ప్రభావంతో కర్ణాటక, పంజాబ్ వంటి రాష్ట్రాలు జీరో విద్యా సంవత్సరం ప్రకటించగా.. ఏపీ సహా పలు రాష్ట్రాలు ఆన్లైన్లోనూ, ఆఫ్లైన్లోనూ విద్యార్థులకు పాఠాలు చెప్పించాయి. కొన్ని […]
ఇదీ రాష్ట్రంలో జరుగుతున్న విద్యావ్యాపారం. వేలల్లో, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ, గంటలకొద్దీ తరగతి గదుల్లో విద్యార్థులను బందీలను చేసి ర్యాంకుల పోరాటంలో దూసుకెళ్తున్న ప్రైవేట్ విద్యావ్యాపార సంస్థల పనితీరు ఇది. ఆట స్థలాలు ఉండవు. ఆటలు ఉండవు. సాంస్కృతిక కార్యక్రమాలు లేవు. వినోదం లేదు. అంతా బట్టీ పట్టడమే. ప్రశ్నలు బట్టియే. జవాబులు బట్టియే. మార్కులకోసం, ర్యాంకుల కోసం నిత్యం పరుగులు. రోజుకు ఉండే 24 గంటల్లో దాదాపు 18 గంటలు పుస్తకాలతో కుస్తీయే. అపార్టుమెంటు […]
జేఎన్యూలో ఫీజులో పెంపుదలతో మొదలయిన విద్యార్థుల ఆందోళన ఉధృత రూపం దాలుస్తోంది. ఆ వెంటనే సీఏఏకి వ్యతిరేకంగా స్వరం వినిపించారు. ఎన్నార్సీని నిరసిస్తూ పోరు సాగించారు. ఈ పరిణామాలకు తోడుగా జేఎన్యూ సబర్మతి హాస్టల్ లో ముసుగులేసుకు వచ్చిన ముష్కరులు అంధులు, అమ్మాయిలు అనే తేడా లేకుండా హాకీ స్టిక్స్ , రాడ్డులతో దాడి చేయడం కలకలం రేపింది. దేశమంతా విద్యార్థి ఉద్యమం ఎగిసిపడుతోంది. దాడి చేసింది ఏబీవీపీ కార్యకర్తలేనని ఆ శిబిరానికి చెందిన నాయకులు టైమ్స్ […]