iDreamPost
android-app
ios-app

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏకంగా రూ. 48 వేల స్కాలర్‌షిప్ పొందే ఛాన్స్.. అర్హులు వీరే

National Means Cum Merit Scholarship Scheme: విద్యార్థులకు గుడ్ న్యూస్. తాజాగా తెలంగాణలో నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌(ఎన్ఎంఎంఎస్)-2024 పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. ఈ పరీక్ష పాసైతే చాలు రూ. 48 వేల స్కాలర్ షిప్ అందుకోవచ్చు.

National Means Cum Merit Scholarship Scheme: విద్యార్థులకు గుడ్ న్యూస్. తాజాగా తెలంగాణలో నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌(ఎన్ఎంఎంఎస్)-2024 పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. ఈ పరీక్ష పాసైతే చాలు రూ. 48 వేల స్కాలర్ షిప్ అందుకోవచ్చు.

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏకంగా రూ. 48 వేల స్కాలర్‌షిప్ పొందే ఛాన్స్.. అర్హులు వీరే

చదువు అందరికీ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు వినూత్నమైన పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ప్రతిభ ఉండి డబ్బు లేని కారణంగా చదువుకు దూరమవుతున్నవారు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు స్కాలర్ షిప్స్ అందిస్తున్నాయి. ప్రభుత్వాలతో పాటు పలు కార్పోరేట్ సంస్థలు కూడా స్కాలర్ షిప్స్ ను ఇస్తున్నాయి. ఈ ఉపకార వేతనాల సాయంతో విద్యార్థులు తమ చదువులను కొనసాగించుకునేందుకు వీలు కలుగుతుంది. తాజాగా తెలంగాణలో నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌(ఎన్ఎంఎంఎస్)-2024 పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. ఈ పరీక్ష పాసైతే చాలు రూ. 48 వేల స్కాలర్ షిప్ అందుకోవచ్చు.

విద్యార్థులను పై చదువులకు ప్రోత్సహించేందుకు 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు ఆర్థిక చేయూత కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్ఎంఎంఎస్) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12,000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు వీరికి స్కాలర్‌షిప్ అందుతుంది. అంటే నాలుగు సంవత్సరాల్లో రూ. 48 వేల స్కాలర్ షిప్ పొందుతారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు అప్లై చేసుకునేందుకు అర్హులు.

విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ పొందాలంటే.. ఏడో తరగతిలో కనీసం 55 శాతం మార్కులు పొందిన విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ పరీక్ష రాయడానికి అర్హులు. ఫైనల్ సెలక్షన్ నాటికి ఎనిమిదో తరగతిలో 55 శాతం మార్కులు పొంది ఉండాలి. ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠశాలల్లో రెగ్యులర్ విధానంలో చదవుతూ ఉండాలి. కుటుంబ వార్షికాదాయం రూ.3,50,000 మించకూడదు. దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.50 చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో విద్యార్థుల దరఖాస్తులను ఆయా స్కూళ్లు సమర్పించాలి. అర్హత గల విద్యార్థులు సెప్టెంబరు 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 24న రాతపరీక్ష నిర్వహించనున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.