iDreamPost
android-app
ios-app

నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. ఈ కోర్సు నేర్చుకుంటే జాబ్ గ్యారెంటీ

  • Published Aug 06, 2024 | 10:10 PM Updated Updated Aug 06, 2024 | 10:10 PM

ISRO:మనిషి టెక్నాలజీ రంగంలో ఎన్నో విప్లవాత్మక విజయాలు సాధించాడు. మనిషి ప్రాణాలు తిరిగి తీసుకురావడం మినహా అన్ని రకాల ప్రయోగాలు చేస్తూ తనదైన సత్తా చాటుతున్నాడు. ఇప్పుడు ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాసిస్తుంది.

ISRO:మనిషి టెక్నాలజీ రంగంలో ఎన్నో విప్లవాత్మక విజయాలు సాధించాడు. మనిషి ప్రాణాలు తిరిగి తీసుకురావడం మినహా అన్ని రకాల ప్రయోగాలు చేస్తూ తనదైన సత్తా చాటుతున్నాడు. ఇప్పుడు ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాసిస్తుంది.

  • Published Aug 06, 2024 | 10:10 PMUpdated Aug 06, 2024 | 10:10 PM
నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. ఈ కోర్సు నేర్చుకుంటే జాబ్ గ్యారెంటీ

టెక్నాలజీలో మనిషి ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. తన అవసరాలకు అనుగుణంగా ఎన్నో వస్తువులు తయారు చేస్తున్నాడు. యువతకు సాఫ్ట్‌వేర్ రంగంలో ఎన్నో రకాల ఉద్యోగవకాశాలు ఉన్నాయి. అందుకే ఎక్కువ మంది ఇంజనీరింగ్ వైను మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత టెక్ వరల్డ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఐ) వంటి టెక్నాలజీలు కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. రాబోయే రోజులో వీటి ఆధిపత్యం మరింత పెరుగుతుందని సాంకేతిక రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే..

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త. ఏఐ, ఎంఎల్ విభాగాల్లో మంచి అనుభవం సాధించిన వారికి అద్భుతమైన ఉద్యోగవకాశాలు లభిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఇస్రో నిరుద్యోగులకు ఉచిత ఆన్ లైన్ కోర్సును ఆఫర్ చేస్తుంది. ఇస్రో ఏఐ, ఎంఎల్ టెక్నాలజీ పై 5 రోజుల పాటు ఫ్రీ ఆన్ లైన్ కోర్సులు ఆగస్టు 19 నుంచి ప్రారంభించనుంది. ఐఐఆర్ఎస్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ కోర్సు ఆఫర్ చేస్తుంది. 2017 లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్ ప్రారంభించింది. ప్రతి సంవత్సరం ఈ అంశంపై ఉచిత కోర్సును అందిస్తుంది.

ఐఐఆర్ఎన్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్ ఇస్రో 3,500 పైగా నెట్ వర్క్ ఇనిస్టిట్యూట్ లకు విస్తరించి ఉంది. జియో స్పేషియల్ టెక్నాలజీ.. దాని యొక్క అప్లికేషన్ కెపాసిటీ బిల్డింగ్ ను ప్రోత్సహించడంలో ఈ ప్రోగ్రామ్ ఎంతగానో ఉపయోగ పడుతుందని అంటున్నారు. ఆగస్టు 19 నుంచి 23 మధ్య ఈ కోర్సును ఇస్రో షెడ్యూల్ చేసింది. అ సదావకాశాన్ని నిరుద్యోగులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతుంది. ఈ-క్లాస్ ఫ్లాట్ ఫారమ్ ద్వారా లెక్చర్ స్లైడ్స్, వీడియో రికార్డెడ్ లెక్చరర్స్, ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్, డెమానిస్ట్రేషన్ ద్వారా ఈ కోర్సు ఉంటుంది. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు జరగుతాయి.