iDreamPost
android-app
ios-app

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటర్ పాసైతే చాలు.. ఏడాదికి 1.5 లక్షల స్కాలర్‌షిప్!

Kotak Kanya Scholarship 2024-25: విద్యార్థులకు గుడ్ న్యూస్. కొటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇంటర్ పూర్తి చేసిన వారికి ఏడాదికి 1.5 లక్షల స్కాలర్ షిప్ అందిస్తోంది. ఇప్పుడే అప్లై చేసుకోండి.

Kotak Kanya Scholarship 2024-25: విద్యార్థులకు గుడ్ న్యూస్. కొటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇంటర్ పూర్తి చేసిన వారికి ఏడాదికి 1.5 లక్షల స్కాలర్ షిప్ అందిస్తోంది. ఇప్పుడే అప్లై చేసుకోండి.

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటర్ పాసైతే చాలు.. ఏడాదికి 1.5 లక్షల స్కాలర్‌షిప్!

సరస్వతీ దేవీ కటాక్షం ఉన్నా లక్ష్మీ దేవీ కటాక్షం లేక ఎంతో మంది చదువుకు దూరమవుతున్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకోవాలనే తమ కోరికను చంపుకుంటున్నారు. ప్రతిభ ఉండి కూడా డబ్బు లేని కారణంగా ఎంతో మంది విద్యార్థులు చదువుకు నోచుకోలేకపోతున్నారు. ఇలాంటి వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వాలు స్కాలర్ షిప్స్ ప్రకటిస్తుంటాయి. ప్రభుత్వాలే కాకుండా పలు కార్పోరేట్ సంస్థలు సామాజిక సేవలో భాగంగా విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందిస్తుంటాయి. ఈ క్రమంలో కొటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది. ఏడాదికి ఏకంగా రూ. 1.5 లక్షల స్కాలర్ షిప్ అందించనుంది. ఇంతకీ అర్హులు ఎవరంటే?

ఉన్నత చదువులు చదువుకోవాలంటే ఎంతో కొంత డబ్బు అవసరం పడుతుంది. చదువుకు అయ్యే ఖర్చును భరించలేక కొంత మంది విద్యార్థులు చదువును ఆపేస్తుంటారు. ఇలాంటి విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు కొటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ కొటక్ కన్యా స్కాలర్ షిప్ 2024-25 పేరిట ప్రతిభావంతులైన బాలికలకు ఉన్నత విద్య కోసం స్కాలర్‌షిప్ అందిస్తోంది. విద్యార్థినులను ఉన్నత విద్య వైపు ప్రోత్సహిచి వారి ఉన్నతికి తోడ్పడేందుకు ఈ స్కాలర్ షిప్ అందిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇంటర్ పూర్తి చేసిన వారికి ఈ స్కాలర్ షిప్ అందించనున్నది.

ఇంటర్లో 75శాతం మార్కులు ఉన్న విద్యార్థులు సెప్టెంబర్ 30 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, బీడీఎస్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బీ, బీఫార్మసీ, నర్సింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.6 లక్షల లోపు ఉండాలి. ఇన్ కమ్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ.1.5లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తారు. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, బీడీఎస్, ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ (5 సంవత్సరాలు), బీఫార్మసీ, బీఎస్సీ వంటి ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అభ్యసించే విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.