iDreamPost
android-app
ios-app

ఘోర విషాదం.. స్కూల్ బస్సులో మంటలు.. 25 మంది విద్యార్థులు మృతి

School bus catches fire: స్కూల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. బస్సులో మంటలు చెలరేగడంతో 25 మంది విద్యార్థులు సజీవదహనమయ్యారు. ప్రమాద దృష్యాలు నెట్టింటా వైరల్ గా మారాయి.

School bus catches fire: స్కూల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. బస్సులో మంటలు చెలరేగడంతో 25 మంది విద్యార్థులు సజీవదహనమయ్యారు. ప్రమాద దృష్యాలు నెట్టింటా వైరల్ గా మారాయి.

ఘోర విషాదం.. స్కూల్ బస్సులో మంటలు.. 25 మంది విద్యార్థులు మృతి

ఇటీవలి కాలంలో స్కూల్ బస్సు ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. స్కూల్ యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. నైపుణ్యం లేని డ్రైవర్లను నియమించుకుని ప్రమాదాలకు కారణమవుతున్నారు. మితిమీరిన వేగంతో బస్సులను నడిపి రోడ్డు ప్రమాదాలకు కారకులవుతున్నారు. అదే సమయంలో స్కూల్ బస్సు ఫిట్ నెస్ విషయంలో కూడా అజాగ్రత్తగా వ్యవహరించడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నాయి. స్కూల్ బస్సు ప్రమాదాల కారణంగా ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థులు మృతి చెందున్నారు. కుటుంబాల్లో తీరని విషాదం చోటుచేసుకుంటుంది.

తాజాగా మరో ఘోర విషాదం జరిగింది. ఓ స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని 25 మంది విద్యార్థులు సజీవ దహనమయ్యారు. ఈ ఘోర విషాదం థాయ్ లాండ్ లో చోటుచేసుకుంది. బ్యాంకాక్‌లోని సెంట్రల్‌ ఉతాయ్‌ థాని ప్రావిన్స్‌ నుంచి విహారయాత్రకు వెళ్లివస్తున్న పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదవశాత్తూ స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి. దట్టమైన మంటలు ఎగిసిపడ్డాయి. ఊహించని ఘటనతో బస్సులో ఉన్న వారంతా ఉలిక్కిపడ్డారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని హాహాకారాలు చేశారు. ఆ ప్రాంతమంతా వారి అరుపులతో దద్దరిల్లింది. కాగా ఈ ఘటనలో 25మంది విద్యార్థులు చనిపోయినట్లు తెలుస్తోంది.

ప్రమాద సమయంలో బస్సులో సుమారు 44మంది ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదం నుంచి 16మంది విద్యార్థులను, ముగ్గురు టీచర్లను కాపాడారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. స్కూల్ బస్సు ప్రమాదంపై థాయ్‌ల్యాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విహార యాత్రలో విషాదం చోటుచేసుకోవడంతో మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఈ ఘటనపై థాయ్‌ల్యాండ్‌ మంత్రి అనుతిన్‌ చర్నవిరకుల్‌ స్పందించారు. పాఠశాల బస్సులో 38మంది విద్యార్థులు, ఆరుగురు టీచర్లు మెుత్తం 44మంది ప్రయాణిస్తున్నారని మంత్రి తెలిపారు. వీరంతా బ్యాంకాక్ నుంచి సెంట్రల్‌ ఉతాయ్‌ థాని ప్రావిన్స్‌‌కు విహారయాత్ర వెళ్లారని ఆయన తెలిపారు. టూర్ ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో బ్యాంకాక్ నగరంలో స్కూల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైందని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.